బాబుకు మైలేజ్ పెంచేస్తున్నారా..కుప్పంలో తమ్ముళ్ళు తగ్గలేదు.!

మొత్తానికి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో..కుప్పంలో టీడీపీ శ్రేణులని నిలువరించలేకపోయింది..వరుసగా కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోవడంతో..ఇకపై రోడ్లపై సభలు, ర్యాలీలు చేయకూడదని ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. పోలీసులు అనుమతించిన ప్రదేశాల్లోనే సభలు పెట్టుకోవాలని సూచించారు. అయితే నెల క్రితమే చంద్రబాబు కుప్పం టూర్ షెడ్యూల్ అయింది. దీంతో తాజాగా బాబు కుప్పంకు వచ్చారు..కానీ అడుగడుగున కుప్పంలో టీడీపీ శ్రేణులని పోలీసులు అడ్డుకున్నారు. ప్రచార వాహనాన్ని సీజ్ చేశారు. రచ్చబండ స్టేజిని తీసేశారు. […]

గుంటూరు వెస్ట్‌లో కొత్త ట్విస్ట్..టీడీపీ సీటు ఆమెకేనా?

గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలమైన స్థానాల్లో గుంటూరు వెస్ట్ కూడా ఒకటి. గుంటూరు నగరంలో ఉన్న ఈ సీటులో గత రెండు ఎన్నికల నుంచి టీడీపీ గెలుస్తూ వస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ గాలి ఉన్నా సరే టీడీపీ నుంచి మద్దాలి గిరి గెలిచారు. కానీ తర్వాత మద్దాలి వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో గుంటూరు వెస్ట్ టీడీపీ ఇంచార్జ్ గా కోవెలమూడి రవీంద్ర పనిచేస్తున్నారు. అయితే ఈయనకు నెక్స్ట్ సీటు ఇవ్వడం కష్టమే […]

ఎమ్మెల్యే అవుతా..సీటు ఎక్కడ బుద్దా?

విజయవాడ తెలుగుదేశంలో జరిగే అంతర్గత రాజకీయాలు ఎప్పుడు వివాదాస్పదం అవుతాయనే చెప్పాలి. అక్కడ సొంత పార్టీ నేతలతోనే పడదు. ఎంపీ కేశినేని నాని, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలకు పడని విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు వారి మధ్య బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. ముఖ్యంగా విజయవాడ వెస్ట్ సీటు విషయంలో వారి మధ్య రచ్చ జరుగుతూనే ఉంది. ఈ సీటు కోసం పోటీ పడుతున్నారు. అయితే ప్రస్తుతం ఆ సీటుకు ఇంచార్జ్ గా కేశినేని నాని ఉన్నారు..అయినా […]

పర్చూరుకు ఆమంచి..రావికి హ్యాండ్..ఏలూరికి అడ్వాంటేజ్.!

వచ్చే ఎన్నికల్లో కొందరికి సీట్లు ఇచ్చే విషయంలో జగన్ బాగా ఆలోచనలో పడిన విషయం తెలిసిందే. కొందరు సీట్లు మార్చాలని ఎప్పటినుంచో చూస్తున్నారు. ఇదే క్రమంలో మొదట నుంచి సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్న సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డికి చెక్ పెట్టారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి స్థానానికి ఇంచార్జ్ గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని పెట్టారు. దీంతో ఆనంకు చెక్ పెట్టినట్లు అయింది. ఇక అటు పర్చూరు స్థానానికి ఇంచార్జ్ గా […]

ఆనంకు టీడీపీలోకి లైన్ క్లియర్ చేసిన జగన్..!

గత కొంతకాలంగా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డికి జగన్ చెక్ పెట్టారు. ఇప్పటికే ప్రభుత్వంపై పలుమార్లు విమర్శలు చేశారు. రోడ్లపై గుంతలు పూడ్చలేదని, కొత్త ప్రాజెక్టులు కట్టలేదని అలా అయితే జనంలోకి వెళ్లి ఓట్లేయమంటూ ఎలా అడుగుతామని అన్నారు. పింఛన్లు పెంచితే గెలిచేటట్లయితే… గతంలో చంద్రబాబు కూడా భారీగా పెంచారని.. అయినా గెలువలేదని గుర్తుచేస్తున్నారు. మరోవైపు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి వెంకటగిరికి కాబోయే ఎమ్మెల్యే తానేనని చెప్పుకొంటూ వస్తున్నారు. దీనినీ ఆనం […]

రోడ్లపై నో ఎంట్రీ..జగన్‌కు నో రూల్..కుప్పంకు బాబు.!

ఇటీవల వరుస ప్రమాద ఘటనలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కందుకూరు, గుంటూరు టీడీపీ సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందడం సంచలనమైన విషయం తెలిసిందే. బాబు ప్రచార పిచ్చి వల్లే ఇదంతా జరిగిందని వైసీపీ అంటుంది. పోలీసుల సెక్యూరిటీ కావల్సిన విధంగా లేకపోవడం, ఇందులో ఏదో కుట్ర కోణం ఉండటం వల్లే 11 మంది చనిపోయారని టీడీపీ ఆరోపిస్తుంది. ఇక ఏది ఎలా జరిగినా ఆ ఘటనల వల్ల జగన్ […]

సిక్కోలులో టీడీపీ-వైసీపీలకు ఫిఫ్టీ-ఫిఫ్టీ ఛాన్స్.!

తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి శ్రీకాకుళంలో రాజకీయాలు హోరాహోరీగా నడుస్తున్నాయి. ఇక్కడ టీడీపీ-వైసీపీల మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. జిల్లాలో ఇప్పుడు రెండు  పార్టీలకు సమాన అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ పైచేయి సాధించగా, 2019 ఎన్నికల్లో వైసీపీ పైచేయి సాధించింది. జిల్లాలో 10 సీట్లు ఉంటే వైసీపీ 8, టీడీపీ 2 సీట్లు గెలుచుకుంది. అయితే ఇప్పుడు సీన్ మారింది..టీడీపీ చాలావరకు పుంజుకుందని సర్వేల్లో తేలింది. కాకపోతే ఇంకా లీడ్ లోకి […]

టీడీపీ-జనసేన పొత్తులో పాత లెక్కలు..కొత్త సీట్లు!

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పార్టీలు పొత్తు దిశగా వెళుతున్న విషయం తెలిసిందే. అధికారికంగా ఇంకా పొత్తుపై ప్రకటన రాలేదు గాని అటు చంద్రబాబు, ఇటు పవన్ సైతం పొత్తుకు రెడీగానే ఉన్నారని తెలుస్తోంది. వీరితో బీజేపీ కలిసొస్తే ఓకే లేదంటే..టీడీపీ-జనసేన పొత్తు ఖాయమని సమాచారం. ఇప్పటికే ఈ పొత్తుకు సంబంధించి సీట్లు పంచాయితీ కూడా నడుస్తున్న విషయం తెలిసిందే. జనసేన ఏమో 40 సీట్లు అడుగుతుందని, టీడీపీ ఏమో 25-30 సీట్లు ఇస్తానని అంటుందని చెప్పి ఎప్పటినుంచో […]

కోటంరెడ్డిని కలిశారు..మరి ఆనంని వదిలేసినట్లేనా?

ఇటీవల కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వంపైనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కొందరు ప్రభుత్వ అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ విధానాలని సైతం తప్పుబట్టే పరిస్తితి ఉంది. ఇటీవల సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డి తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కొత్త ప్రాజెక్టులు కట్టలేదని, గుంతలు పూడ్చలేదని, ఇళ్ళు కట్టలేదని..ఇంకా ప్రజలని ఓట్లు ఎలా అడుగుతామని ఆనం ప్రశ్నించారు. పథకాల పేరిట డబ్బులు ఇస్తే ఓట్లు వేసేస్తారా […]