గుంటూరు వెస్ట్‌లో కొత్త ట్విస్ట్..టీడీపీ సీటు ఆమెకేనా?

గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త అనుకూలమైన స్థానాల్లో గుంటూరు వెస్ట్ కూడా ఒకటి. గుంటూరు నగరంలో ఉన్న ఈ సీటులో గత రెండు ఎన్నికల నుంచి టీడీపీ గెలుస్తూ వస్తుంది. గత ఎన్నికల్లో వైసీపీ గాలి ఉన్నా సరే టీడీపీ నుంచి మద్దాలి గిరి గెలిచారు. కానీ తర్వాత మద్దాలి వైసీపీ వైపుకు వెళ్లారు. దీంతో గుంటూరు వెస్ట్ టీడీపీ ఇంచార్జ్ గా కోవెలమూడి రవీంద్ర పనిచేస్తున్నారు. అయితే ఈయనకు నెక్స్ట్ సీటు ఇవ్వడం కష్టమే అని తెలుస్తోంది. ఈ సీటు కోసం చాలామంది టీడీపీ నేతలు కాచుకుని కూర్చున్నారు.

ఇక్కడ టీడీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉండటంతో..సీటుకోసం పోటీ పడేవాళ్లు ఎక్కువ ఉన్నారు. ఎలాగో ఇక్కడ వైసీపీలోకి వెళ్ళిన మద్దాలి గిరికి అనుకున్న మేర పాజిటివ్ కనిపించడం లేదు. పైగా వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువ కనిపిస్తోంది. దీంతో వెస్ట్ సీటులో టీడీపీ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అయితే ఈ సీటు ఎవరికి ఇస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. పొత్తు ఉంటే ఈ సీటు జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం ఉంది.

కొలికపూడి కొత్త డిమాండ్..టీడీపీలో శైలజకు సీటు? | Manalokam

కానీ జనసేనకు గుంటూరు ఈస్ట్, తెనాలి సీట్లు ఇస్తారని ప్రచారం ఉంది. ఎలాగో సిట్టింగ్ సీటు కాబట్టి..ఈ సీటుని వదులుకోవడనికి టీడీపీ సిద్ధంగా లేదు. ఇక ఈ సీటుని అమరావతి ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్న రాయపాటి శైలజకు ఇవ్వాలని డిమాండ్ వినిపిస్తుంది. అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా డిమాండ్ పెట్టారు. గుంటూరులో అసెంబ్లీ సీటు రాయపాటి శైలజకు ఇవ్వాలని కోరారు.

అయితే  కొలికపూడికి నందిగామ సీటు ఇస్తారనే ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. ఇటు కొలికపూడి ఏమో శైలజకు గుంటూరులో అసెంబ్లీ సీటు ఇవ్వాలని అంటున్నారు. మరి చూడాలి చంద్రబాబు ఎవరికి ఛాన్స్ ఇస్తారో.