సినిమాల్లోకి రాకముందు ఈ బాలీవుడ్ నటులు ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

సినీ ఇండస్ట్రీకి రాకముందు చాలా మంది బాలీవుడ్ హీరోలు ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ లిస్ట్ లో అమితాబ్‌ బచ్చన్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు. ఇండస్ట్రీలోకి రావడం అనేది అంత ఈజీ కాదు. అయినా కూడా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా అనేక కష్టాలు పడుతూ చివరికి స్టార్ హీరోలుగా మారారు వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

నవాజుద్దీన్ సిద్ధిఖి

బాలీవుడ్‌లో నవాజుద్దీన్ సిద్ధిఖి తన టెరిఫిక్ యాక్టింగ్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే సినిమాలోకి రాకముందు ఆయన ఏ పనీ చేసేవారో ఎవరికీ తెలియదు. కొన్ని మీడియాల సమాచారం ప్రకారం నవాజుద్దీన్ సిద్ధిఖి సినిమాలోకి రాకముందు వాచ్‌మెన్‌గా పనిచేసేవారు.

అక్షయ్ కుమార్

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. అంత గొప్ప స్థానానికి చేరుకోవడానికి అక్షయ్ కుమార్ చాలా కష్టపడాడు. అయితే ఇండస్ట్రీ లోకి రాకముందు అక్షయ్ కుమార్ వెయిటర్‌గా పనిచేశాడట.

షారుఖ్ ఖాన్

షారుఖ్ ఖాన్ అంటే తెలియని వారు ఉండరు. అమ్మాయిలను మీ డ్రీమ్ బాయ్ ఎవరు అంటే చాలామంది షారుఖ్ ఖాన్ అని చెబుతారు. దాదాపు 4 ఏళ్ల గ్యాప్ తరువాత ‘పఠాన్ ‘ అనే సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు షారుఖ్. అయితే షారుఖ్ ఇండస్ట్రీ లోకి రాకముందు టికెట్స్ సేల్స్‌మెన్‌గా పనిచేశాడట. ఆ సమయంలో షారుఖ్ కి రూ.50 జీతం తీసుకునేవారట.

రజినీకాంత్

సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. రజినీకాంత్ ఎన్నో కష్టాలు పడిన తరువాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే రజినీకాంత్ సినిమా లోకి రాకముందు బస్సు కండక్టర్ గా పనిచేసేవారు.

దిలీప్ కుమార్

ప్రస్తుతం దిలీప్ కుమార్ మన మధ్య లేరు. కానీ ఆయన జ్ఞాపకాలు మాత్రం ఆయన నటించిన సినిమాల ద్వార ఎపుడు ప్రేక్షకుల మనసులో ఉంటారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలో నటించిన ఆయన సినిమాలోకి రాకముందు పండ్లు అమ్ముకునేవారని సమాచారం.

అమితాబ్‌ బచ్చన్

బాలీవుడ్ మెగాస్టార్ అంటే అమితాబ్‌ బచ్చన్ పేరు చెప్తారు దాదాపు 50 సంవత్సరాలుగా ప్రేక్షకులను అల్లరిస్తూనే ఉన్నారు ఆయన. ఇప్పటికి అమితాబ్‌ బచ్చన్ సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉంటారు. ఆయన ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టకముందు ఆయన కోల్‌కత లోని ఒక ఫిషింగ్ కంపెనీలో పనిచేసారని సమాచారం.