బాబుకు మైలేజ్ పెంచేస్తున్నారా..కుప్పంలో తమ్ముళ్ళు తగ్గలేదు.!

మొత్తానికి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో..కుప్పంలో టీడీపీ శ్రేణులని నిలువరించలేకపోయింది..వరుసగా కందుకూరు, గుంటూరు సభల్లో తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోవడంతో..ఇకపై రోడ్లపై సభలు, ర్యాలీలు చేయకూడదని ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. పోలీసులు అనుమతించిన ప్రదేశాల్లోనే సభలు పెట్టుకోవాలని సూచించారు. అయితే నెల క్రితమే చంద్రబాబు కుప్పం టూర్ షెడ్యూల్ అయింది.

దీంతో తాజాగా బాబు కుప్పంకు వచ్చారు..కానీ అడుగడుగున కుప్పంలో టీడీపీ శ్రేణులని పోలీసులు అడ్డుకున్నారు. ప్రచార వాహనాన్ని సీజ్ చేశారు. రచ్చబండ స్టేజిని తీసేశారు. అయితే బాబు కుప్పంకు రాగానే ఆయన్ని అడ్డుకోవడానికి చూశారు. కానీ బాబు పోలీసులపై విరుచుకుపడ్డారు. ఏ కారణం చేత తన నియోజకవగ్రంలో తిరగకూడదో చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే చివరికి బాబు పాదయాత్ర ద్వారా ప్రజల దగ్గరకు వెళ్లారు. అటు టీడీపీ సేరేణులు సైతం భారీ ఎత్తున బాబు వెనుక వచ్చారు. పోలీసులు చాలావరకు ఆపడానికి చూశారు గాని..తెలుగు తమ్ముళ్ళు వెనక్కి తగ్గలేదు. లాఠీ చార్జ్ చేయడం వల్ల గాయాలుపాలైన సరే అలాగే నిలబడ్డారు.

అంటే తమ్ముళ్ళు తెగించినట్లు కనబడుతున్నారు. అయితే ఇదే జీవో వచ్చాక జగన్..రాజమండ్రిలో రోడ్ షో చేశారని, మరి దానికి ఎలా అనుమతి ఇచ్చారని పోలీసులపై మండిపడుతున్నారు. ఇక కుప్పంలో బాబుని అడ్డుకోవడంపై రాష్ట్రం వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనలు తెలియజేశాయి.

అటు పవన్‌తో పాటు ఇతర పార్టీల నేతలు బాబుకు మద్ధతుగా నిలిచారు. అయితే ఇలా ప్రతిపక్షాలని అడ్డుకునేలా జీవో తీసుకురావడంపై మండిపడుతున్నారు. ఇక జీవోతో ప్రతిపక్షాలని అడ్డుకుని..ఇంకా వారి మైలేజ్ పెంచుతున్నట్లు కనిపిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబుని అనేక ఆంక్షలు ద్వారా అడ్డుకునే ప్రయత్నాలు చేయడం..ఆయనపై సానుభూతి పెంచేలా చేశారు. దీని వల్ల పరోక్షంగా బాబుకే లబ్ది చేకూరేలా ఉంది. మరి ఈ జీవోపై వైసీపీ ప్రభుత్వం మరోసారి ఆలోచన చేస్తుందేమో అని విశ్లేషకులు అంటున్నారు.