స్టార్ హీరోయిన్ల ప్లేస్ ని ఆక్రమించిన యంగ్ హీరోయిన్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత చాలానే ఉంటుందని చెప్పవచ్చు. వారంలో ఎన్నో సినిమాలు విడుదలవుతున్న అందులో కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తున్నప్పటికీ స్టార్ స్టేటస్ ను మాత్రం అందుకోలేక పోతున్నారు. అందం ,అభినయం నుండి అదృష్టం కలిసి రాలేక కొంతమంది. ఈ క్రమంలోనే స్టార్ క్రేజ్ సంపాదించిన కొంతమంది హీరోయిన్స్ ని కేవలం స్టార్ హీరోలంతా రిపీట్ సినిమాలలో చేస్తూ ఉంటారు.స్టార్ హీరోల సినిమాలు అంటే చాలు ఎక్కువగా పూజా హెగ్డే రష్మిక ,సమంత, కీర్తి సురేష్ వంటి వారు పేర్లు వినిపిస్తూ ఉంటాయి.

Samantha and Pooja Hegde to Rashmika: Tollywood divas wish fans on Ugadi  and Gudi Padwa | Telugu Movie News - Times of Indiaఅయితే ఈమధ్య హీరోయిన్స్ కి మంచి డిమాండ్ పెరగడంతో వారు కూడా ఎక్కడ తగ్గడం లేదు. పూజా హెగ్డే స్టార్ క్రేజ్ అందుకున్నప్పటికీ సరైన పాత్రలు ఎంచుకోలేకపోవడంతో చాలా సతమతమవుతోంది. ఇక రష్మిక కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటుంది. అలాగే గత ఏడాది విడుదలైన సినిమాలన్నీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం రష్మిక చేతిలో కేవలం వారసుడు సినిమా మాత్రమే మిగిలి ఉంది. ఇక సమంత విషయానికి వస్తే డైవర్స్ తర్వాత సమంత కేవలం లేడీ ఓరియంటెడ్ సినిమాలకే ఫిక్సయింది.

ఇక అందుచేతనే స్టార్ హీరోలంతా ఎక్కువగా కొత్త హీరోయిన్స్ వైపే మగ్గు చూపుతున్నారు. సమంత, రస్మిక పూజ హెగ్డే తర్వాత అంతటి క్రేజ్ అందుకున్న వారిలో శ్రీలీల ,మృణాల ఠాగూర్ మాత్రమే ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి..శ్రీ లీల చేతులో ప్రస్తుతం వైష్ణవి సినిమా లో నటిస్తోంది. ఈ సినిమా సక్సెస్ అయ్యిందంటే ఈ ముద్దుగుమ్మ కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంటుంది. ఇక మృణాల్ ఠాగూర్ కేవలం సీతారామం చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం నాని నటిస్తున్న 30వ సినిమాలో ఈమె నటిస్తోంది ఈ సినిమాతో పాటు మరొక రెండు సినిమాలు. చూస్తుంటే రష్మిక సమంత పూజ హెగ్డే ప్లేసులో కొత్తగా శ్రీ లీల మృణాల్ ఠాగూర్ చేరిపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.