స‌ర్‌ప్రైజ్‌.. సంక్రాంతికి ఒక‌టి కాదు బాల‌య్య నుంచి రెండు సినిమాలు వ‌స్తున్నాయ్‌!

ఈ సంక్రాంతికి నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి ఒకటి కాదు రెండు సినిమాలు రాబోతున్నాయి. అవును మీరు విన్నది నిజమే. ఆల్రెడీ బాలయ్య నటించిన `వీర సింహారెడ్డి` విడుదలకు సిద్ధమయింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మాస్‌ ఎంటర్టైనర్ లో శ్రుతి హాసన్, హనీ రోజ్‌ హీరోయిన్లుగా నటించారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అలాగే ఈ సంక్రాంతికి బాల‌య్య నుంచి మరో మూవీ కూడా రాబోతోంది. ఆ సినిమా మరేదో కాదు ఆఖండ. బోయపాటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2021 డిసెంబర్ 2న విడుదలై సంచ‌ల‌న విజయాన్ని నమోదు చేసింది.

అయితే ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్ లో విడుదలకు సిద్ధమైంది. హిందీలో డబ్‌ చేసిన రిలీజ్‌ చేసేందుకు పెన్‌ స్టూడియోస్‌ నార్త్ రిలీజ్‌ హక్కులను సొంతం చేసుకుంది. సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 20న రిలీజ్‌ చేయబోతున్నట్టు ప్రకటించింది. త్వ‌ర‌లోనే అఖండ హిందీ ట్రైల‌ర్ కూడా బ‌య‌ట‌కు రాబోతోంది. మ‌రి అఖండ నార్త్ లో ఎలాంటి విజ‌యాన్ని అందుకుంటుందో చూడాలి.