పర్చూరుకు ఆమంచి..రావికి హ్యాండ్..ఏలూరికి అడ్వాంటేజ్.!

వచ్చే ఎన్నికల్లో కొందరికి సీట్లు ఇచ్చే విషయంలో జగన్ బాగా ఆలోచనలో పడిన విషయం తెలిసిందే. కొందరు సీట్లు మార్చాలని ఎప్పటినుంచో చూస్తున్నారు. ఇదే క్రమంలో మొదట నుంచి సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్న సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డికి చెక్ పెట్టారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి స్థానానికి ఇంచార్జ్ గా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని పెట్టారు. దీంతో ఆనంకు చెక్ పెట్టినట్లు అయింది.

ఇక అటు పర్చూరు స్థానానికి ఇంచార్జ్ గా ఆమంచి కృష్ణమోహన్‌ని నియమించారు. దీంతో కొత్త ట్విస్ట్ వచ్చింది. ఎప్పటినుంచో చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరామ్, ఆమంచిల మధ్య అంతర్గత యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు నేతలు..ఆ సీటుపై పట్టుబట్టి ఉన్నారు. మధ్యలో చాలాసార్లు ఆమంచిని పర్చూరుకు పంపాలని చూశారు గాని..ఆమంచి ఒప్పుకోలేదని తెలిసింది. కానీ తాజాగా జగన్..ఆమంచిని పర్చూరు ఇంచార్జ్ గా పంపారు. దీంతో చీరాలలో కరణం ఫ్యామిలీకి లైన్ క్లియర్ అయినట్లు అయింది.

కానీ పర్చూరులో వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న రావి రామనాథం బాబు బాగా కష్టపడుతున్నారు. గడపగడపలో ఈయన ముందున్నారు. కానీ ఇప్పుడు ఆయనని సైడ్ చేసి ఆమంచిని పెట్టారు. దీంతో పర్చూరులో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. రావి కమ్మ వర్గం, ఆమంచి కాపు వర్గం. పర్చూరులో కాపు వర్గం ఓట్లు కలిసొస్తాయని ఆమంచిని పెట్టారు..కానీ ఇక్కడే సీన్ రివర్స్ అయ్యేలా ఉంది.

పర్చూరులో ఉన్న కొంత కమ్మ వర్గం వైసీపీకి మద్ధతుగా ఉంది. కానీ ఇప్పుడు రావిని తప్పించడం వల్ల రివర్స్ అవుతారు. అటు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు కమ్మ వర్గంతో పాటు కాపు వర్గంపై పట్టు ఉంది. పైగా జనసేనతో పొత్తు ఉంటే కాపు ఓట్లు ఏలూరికి కలిసొస్తాయి. ఎటు చూసుకున్న ఆమంచిని పర్చూరులో పెట్టడం వల్ల ఏలూరికే అడ్వాంటేజ్ అంటున్నారు.