సిక్కోలులో టీడీపీ-వైసీపీలకు ఫిఫ్టీ-ఫిఫ్టీ ఛాన్స్.!

తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి శ్రీకాకుళంలో రాజకీయాలు హోరాహోరీగా నడుస్తున్నాయి. ఇక్కడ టీడీపీ-వైసీపీల మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. జిల్లాలో ఇప్పుడు రెండు  పార్టీలకు సమాన అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ పైచేయి సాధించగా, 2019 ఎన్నికల్లో వైసీపీ పైచేయి సాధించింది. జిల్లాలో 10 సీట్లు ఉంటే వైసీపీ 8, టీడీపీ 2 సీట్లు గెలుచుకుంది.

అయితే ఇప్పుడు సీన్ మారింది..టీడీపీ చాలావరకు పుంజుకుందని సర్వేల్లో తేలింది. కాకపోతే ఇంకా లీడ్ లోకి రాలేదని తెలుస్తోంది. అటు వైసీపీ లీడ్ తగ్గుతుంది. ప్రస్తుతం జిల్లాలో 10 సీట్లు ఉంటే టీడీపీ 5, వైసీపీ 5 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తాజా సర్వేలు చెబుతున్నాయి. జిల్లాలో ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నం, పలాస, ఆమదాలవలస నియోజకవర్గాల్లో టీడీపీకి అనుకూలంగా ఉందని, పాలకొండ, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రాజాం, నర్సన్నపేట నియోజకవర్గాల్లో వైసీపీకి అనుకూల వాతావరణం ఉందని అంటున్నారు. ఇక వీటిల్లో కొన్ని సీట్లలో టఫ్ ఫైట్ ఉందని తెలుస్తోంది.

కాస్త టీడీపీకి అనుకూలంగా ఉన్న ఆమదాలవలస, పలాస స్థానాల్లో వైసీపీ కూడా టఫ్ ఫైట్ ఇస్తుంది. ఇటు శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రాజాం స్థానాల్లో వైసీపీకి టీడీపీ గట్టి ఫైట్ ఇస్తుంది. అదే సమయంలో జనసేనతో గాని టీడీపీ పొత్తు పెట్టుకుంటే జిల్లాలో లీడ్ సాధించవచ్చు. శ్రీకాకుళం, ఎచ్చెర్లలో జనసేన ప్రభావం కాస్త ఉంది.

అంటే టీడీపీ-జనసేన పొత్తు బట్టి ఇక్కడ లీడ్ మారిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది..మరి ఈలోపు రాజకీయం ఎలాగైనా మారిపోవచ్చు.