నంద‌మూరి అభిమానుల‌కు బాల‌య్య డ‌బుల్ ధ‌మాకా. .. గెట్ రెడీ…!

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న వీర సింహారెడ్డి సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఇప్పటికే చిత్ర యూనిట్‌ మొదలుపెట్టింది. ఇక ఈనెల ఆరో తేదీన ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. ఈవెంట్‌ కన్నా ముందు అభిమానులకు ఓ బిగ్ సర్ప్రైజ్ చేస్తూ ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన ఈవెంట్‌ను నిర్వహించేందుకు సినిమా యూనిట్ ఏర్పాట్లు చేస్తున్నారట.

Veera Simha Reddy Mass Trailer Loading..

ఇక ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ ను వైజాగ్ ఆర్కే బీచ్ లో మరో రెండు రోజుల్లో నిర్వహించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చిన చిత్ర యూనిట్ ఇక ఈ రెండు ఈవెంట్‌ల‌తో కూడా ప్రమోషన్ల మాత మోగించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వీర సింహారెడ్డి సినిమా యొక్క ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు మొదలయ్యాయి. బాలకృష్ణ కూడా గ‌తంలో మాదిరిగా కాకుండా ఇటీవ‌ల‌ తన సినిమాల ప్రమోషన్ల‌ విషయంలో చాలా చురుగ పాల్గొంటున్నాడు.

Latest: NBK107 is officially titled Veera Simha Reddy | 123telugu.com

అందులోను బాలయ్య సినిమాలను ప్రమోషన్‌ చేసే విషయమై దృష్టి పెట్టాడు. దాదాపుగా పది రోజుల పాటు వీర సింహారెడ్డి సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలకు బాలయ్య డేట్లు కేటాయించాడట. అఖండ రేంజ్ లో ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. సంక్రాంతి విజేత కూడా మా బాలయ్య అంటూ ఫ్యాన్స్ అప్పుడే ప్రచారం మొద‌లు పెట్టారు.