ఎన్టీఆర్ ఆ విషయంలో భార్య కోరిక ఇప్పటికీ తీర్చలేకపోయాడా..!?

నందమూరి ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే ఈయన కెరియర్ మొదటిలో నందమూరి కుటుంబం అంతగా పట్టించుకోలేదు. కానీ తారక్ తన సినిమాలతో నందమూరి ఫ్యామిలీ గౌరవాన్ని మరింత పెంచాడు. అయితే ఇంత చేసినా నందమూరి ఫ్యామిలీ కొన్ని సందర్భాలలో ఎన్టీఆర్ ను చాలా అవమానించారని ఇప్ప‌టికి ఎన్టీఆర్ అభిమానులు చెబుతూ ఉంటారు.

ఎన్టీఆర్‌కు సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ తన సొంత టాలెంట్ తో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తుకు తెచ్చుకున్నాడు. అప్పటినుంచి నందమూరి కుటుంబం కూడా ఆయనకు దగ్గర అయింది. ఇక గత సంవత్సరం త్రిబుల్ ఆర్ సినిమాతో ఆల్ ఇండియా స్థాయిలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించి. ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా వరుస‌ సినిమాలలో నటిస్తున్నాడు.

ఇప్ప‌టికే త‌న 30వ సిమాను ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో ఉండబోతుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. ఇక అంతేకాదు న్యూ ఇయర్ సందర్భంగా రిలీజ్ డేట్ అలాగే షూటింగ్ డేట్ కూడా ప్ర‌క‌టించింది మూవీ యూనిట్. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే. ఎన్టీఆర్- లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఎన్టీఆర్ వైఫ్ ప్రణతి ఏ ఫంక్షన్ లో కనిపించిన అచ్చ తెలుగు అమ్మాయిల చీర కట్టుకుని చాలా అందంగా కనిపిస్తుంది.

Happy Birthday Jr NTR: Adorable photos of RRR actor with wife Lakshmi  Pranathi, sons Abhay Ram-Bhargava Ram

ఇక ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలతో వీరి లైఫ్ చాలా ఎంజాయ్ చేస్తున్నప్పటికీ వీరి వ్యక్తిగత జీవితంలో ఒక వెళితి మాత్రం ఇప్పటికి జూనియర్ ఎన్టీఆర్ లో ఉందట. ఇక ఈ దంపతులు ఇద్దరికీ మగ పిల్లల కన్నా ఆడపిల్ల అంటే చాలా ఇష్టట. ఇక వీరికి మొదటి సంతానంగా కొడుకు పుట్టినప్పుడు ఆనందించారట. కానీ రెండోసారి కొడుకు పుట్టినప్పుడు కాస్త నిరాశ చెందారట.

Jr NTR's Wife Lakshmi Pranathi To Be A Part Of The Social Media Family?

ఇక రెండోసారి తమకు ఆడపిల్ల పుడుతుందని ఆశగా ఎదురు చూసినప్పటికీ కొడుకు పుట్టడంతో ఆ విషయంలో కాస్త హర్ట్ అయ్యారని తెలుస్తుంది. కానీ వీళ్ళిద్దరికీ ఆడపిల్ల అంటే చాలా ఇష్టమట. అందుకే తమ ఇంట్లో ఓ ఆడపిల్ల ఉంటే బాగుండు అని ఇప్పటికీ బాధపడతారట