ఈ సంక్రాంతి బరిలో దిగబోతున్న చిత్రాల్లో విజయ్ దళపతి నటించిన `వారసుడు` ఒకటి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా విడుదల మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య`, నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` చిత్రాలకు పెద్ద తలనొప్పిగా మారింది.
తాను నిర్మించిన వారసుడు సినిమా కోసం దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో చిరు, బాలయ్య చిత్రాలకు థియేటర్స్ దక్కకుండా అడ్డుకుంటున్నాడు. ముఖ్యంగా మెయిన్ సెంటర్స్ లో థియేటర్స్ అన్ని వారసుడికే వచ్చేలా చేస్తున్నాడు. ఈ విషయం పట్ల మెగా, నందమూరి అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇలాంటి తరుణంలో మెగా ఫ్యాన్స్ కు మరింత కాలేలా ఓ న్యూస్ తెరపైకి వచ్చింది.
అదేంటంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా `వారసుడు` సినిమాను వీక్షించాడట. సినిమా చూసినా అనంతరం టీం పై ప్రశంసలు సైతం కురిపించాడట. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతోన్న `ఆర్సీ 15` సినిమాకి సంబంధించిన వర్క్స్ కోసం చెన్నైలోని థమన్ ఆఫీస్ కి రామ్ చరణ్ వెళ్లాడట. ఆ సమయంలోనే దిల్ రాజు చరణ్‌కి వారసుడు ప్రీమియర్ వేసి చూపించాడు. సినిమా చూసిన రామ్ చరణ్ మూవీ గొప్పగా ఉందంటూ తనదైన శైలిలో రివ్యూ ఇచ్చాడట. చిత్ర టీమ్ పై ప్రశంసల వర్షం కురిపించాడట. ఇప్పుడీ విషయం మెగా ఫ్యాన్స్ ను మరింత ఆగ్రహానికి గురి చేసింది.