టీడీపీలో బిల్డప్ బాబాల హంగామా… ఇలా అయితే ఎలా గురూ…!

రాబోయే ఎన్నికల్లో ఎలా అయినా సరే పార్టీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కష్టపడుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కొందరు నేతల తీరు మాత్రం తీవ్ర విమర్శలకు తెర లేపుతోంది. పార్టీ అధినేత నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు వివరించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువకులం పేరుతో నాలుగు […]

ఎంపీ సీట్ల కేటాయింపులో ఫుల్ క్లారిటీ….!

ఏపీలో మూడు పార్టీల మధ్య పొత్తులు దాదాపు ఖరారైనట్లే. అయితే కేవలం సీట్ల కేటాయింపు దగ్గర మాత్రమే పీటముడి ఉందనేది బహిరంగ రహస్యం. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేది తెలుగుదేశం పార్టీ ఏకైక లక్ష్యం. అందుకోసమే పొత్తులకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీని ఓడించాలంటే… అది ఒంటరిగా సాధ్యం కాదని… పొత్తుల ద్వారా అయితే చాలా సులువుగా వైసీపీని ఓడించగలమని ఇప్పటికే పార్టీ నేతలకు చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గతంలో బీజేపీ, జనసేన నేతలపై […]

పార్టీల మధ్య పొత్తులపై క్లారిటీ వచ్చినట్లేనా….!

రాబోయే ఎన్నికల్లో ఏపీలో వైసీపీని ఓడించాలనేది తెలుగుదేశం, జనసేనా పార్టీల ఏకైక లక్ష్యం. అందుకు తగినట్లుగానే దాదాపు రెండేళ్లుగా ఈ రెండు పార్టీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. గతానికి భిన్నంగా చంద్రబాబు నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా మంగళగిరి పార్టీ కార్యాలయంలోనే మకాం వేశారు. సినిమా షూటింగ్ సమయంలో మాత్రమే బయటకు వస్తున్నారు తప్ప…. పూర్తి సమయంలో పార్టీకే కేటాయిస్తున్నారు పవన్. ఇక టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మాజీ […]

ధర్మాన సోదరుల ఓటమే లక్ష్యంగా టీడీపీ ప్లాన్..!

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేది టీడీపీ లక్ష్యం. అందుకు తగ్గట్టుగా పొత్తులతో పాటు ప్రజాసంఘాల మద్దతు కూడా ఓ వైపు కూడగడుతోంది. మరోవైపు పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేస్తున్నారు. ప్రజాదరణ లేని సీనయర్లను పక్కనబెట్టి యువనేతలకు ప్రాధాన్యమిస్తున్నారు. యువమంత్రంతో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట అసెంబ్లీ స్థానంలో ఈ సారి విజయభేరీ మోగించాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో ఈ సారి అసెంబ్లీ పోరు హోరాహోరీగా జరగనుంది. ప్రముఖ రాజకీయ కుటుంబాలు పోటీకి […]

గజపతినగరం టీడీపీలో వర్గపోరు… టికెట్ కోసం సిగపట్లు…!

టీడీపీలో అప్పుడే టికెట్ల పంచాయితీ మొదలైంది. విజయనగరం జిల్లా నేతలు ఎవరికి వారు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. పోటీదారుల బలహీనతలను తమ బలాలుగా మార్చుకుంటూ అధినేత చంద్రబాబునాయుడు దగ్గర మంచి మార్కులు సాధించేందుకు బ్రెయిన్ వర్క్ చేస్తున్నారు. అయితే ఎవరిని హైకమాండ్ కరుణిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ టీడీపీలో టికెట్ రేస్ ఆసక్తికరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణల […]

యలమంచిలి రవి… కేరాఫ్ జనసేన… ఫుల్ క్లియర్…!

రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా కనిపించే నియోజకవర్గాల్లో విజయవాడ తూర్పు కూడా చేరింది. ఇందుకు ప్రధాన కారణం ఈ నియోజకవర్గంలో వేగంగా జరుగుతున్న పరిణామాలే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ హవాలో కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుండి అప్పట్లో పోటీ చేసిన బొప్పన భవకుమార్.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. కానీ ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైసీపీ బాధ్యతలు […]

ప్రొద్దుటూరు టీడీపీ నేతల మధ్య టికెట్ రచ్చ..!

ప్రొద్దుటూరు అసెంట్లీ టీడీపీ టికెట్ కోసం భారీగా పోటీ నెలకొంది. సీనియర్ లీడర్లతో పాటు సీజనల్ నేతలు కూడా టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ ఖాయమైందంటూ అనుచరుల దగ్గర హడావుడి చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీఎం వైఎస్ జగన్ మాత్రం వై నాట్ 175 అని అంటున్నప్పటికీ… సొంత జిల్లాలో మాత్రం పరిస్థితి అలా లేదు. అధికార వైసీపీపై […]

మూడేళ్ల తర్వాత తిరిగి వచ్చారు… మళ్లీ వాళ్లేనా…!

తెలుగుదేశం పార్టీ… 40 వసంతాల వేడుకలను పూర్తి చేసుకుంది. 1982లో ప్రారంభమైన తర్వాత కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఎన్నో ఎత్తు పల్లాలను తెలుగుదేశం పార్టీ రుచి చూసింది. అయితే గతంలో ఎన్నడూ లేనట్లుగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఓట్ల శాతం ఉన్నప్పటికీ… సీట్లు మాత్రం రాలేదు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన టీడీపీ… కేవలం 23 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అటు తెలంగాణలో […]

ఆసక్తిగా మంగళగిరి సమీకరణాలు… టీడీపీకి లాభమా… నష్టమా…!

మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం… తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన నియోజకవర్గం ఇదే అంటే అతిశయోక్తి కాదేమో. ఇందుకు ప్రధాన కారణం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో పాటు… ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం కావడం కూడా. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ప్రజాక్షేత్రంలో దిగిన లోకేశ్… ఓటమితోనే సరిపెట్టుకున్నారు. అయితే మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేస్తా అంటూ బల్లగుద్ది మరీ […]