“అమాయకుడైన చైతన్యను ఎందుకు మోసం చేశావే..?”.. సమంత ఆన్సర్ వింటే ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!

సోషల్ మీడియాలో.. ఎప్పుడు హాట్ టాపిక్ గా ఫైర్ ఫైర్ మీద ట్రెండ్ అయ్యే న్యూస్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది కచ్చితంగా హీరోయిన్ సమంత .. హీరో నాగచైతన్య పెళ్లి మేటర్ అయిన అయి ఉండాలి .. లేదంటే డివర్స్ మేటర్ అయిన అయి ఉండాలి . వీళ్ళు పెళ్లి చేసుకొని విడాకులు కూడా తీసేసుకొని సంవత్సరాలు దాటిపోతుంది . అయినా సరే సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన వార్తలు ట్రెండ్ అవుతూనే ఉంటాయి .

కొన్నిసార్లు ట్రోలింగ్కి గురవుతూనే ఉంటాయి . రీసెంట్గా ఓ అభిమాని సమంతనను ప్రశ్నించిన తీరు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇంతవరకు ఆ విధంగా ఎవరు ఆమెను ప్రశ్నించలేదు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అభిమానులతో ఎప్పటికప్పుడు ముచ్చటిస్తూ ఉండే సమంతా రీసెంట్గా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది .

ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ..”అమాయకుడైన మా నాగచైతన్యను ఎందుకు వదిలేసావు” అంటూ సూటిగా ప్రశ్నించాడు . ఈ అనూహ్యమైన ప్రశ్నతో సమంత షాక్ అయింది . అయితే అందరిలా తప్పించుకోకుండా డేర్ గా సమాధానమిచ్చింది . “ఈ ప్రశ్న మీకు అంత మంచిది కాకపోవచ్చు …అన్ని టెక్నిక్స్ కూడా మీకు తెలియకపోవచ్చు ..మీరు ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటున్నాను” అంటూ చాలా రియలిస్టిక్ గా నెమ్మదిగా తాను చెప్పాలనుకున్న ఆన్సర్ కి సంబంధించిన డీటెయిల్స్ ను పరోక్షంగానే చెప్పేసింది . ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది..!!