ఆ విషయంలో రజినీకాంత్ ను బీట్ చేసే హీరో ఇండస్ట్రీలోనే లేరు.. ఇంతకీ అదేంటంటే..?!

సాధారణంగా హీరోస్ అంటే లగ్జరీ లైఫ్.. పుల్ల లేటెస్ట్ ట్రెండ్స్, స్టైల్ లుక్స్, గట్టి సెక్యూరిటీ, గార్డ్స్, హంగామా ఇలా హడావిడి హడావిడిగా ఉంటారు. కానీ ఇదంతా ఒకప్పటి పద్ధతి. ఇప్పటి హీరోస్ అంతా ఇవన్నీ పక్కనపెట్టి.. సాధారణంగా సింప్లిసిటీతో గడపాలని.. అందరిలాగే ఫ్రీగా జీవించాలని అనుకుంటున్నారు. అలా ఆలోచించే వారిలో మొదట స్టార్ హీరోగా సౌత్ ఇండియాలోనే ఓ వెలుగు వెలుగుతున్న రజినీకాంత్ పేరే వినిపిస్తుంది. ఒకప్పుడు స్టైల్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రజినీ.. కోలీవుడ్ లోనే సూపర్ స్టార్ గా క్రేజ్‌ సంపాదించుకున్నాడు.

కానీ ఆయన సింప్లిసిటీకి మారుపేరుగా మారి.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వాన్ని అలవాటు చేసుకున్నారు. ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలే ఇందుకు ప్రధాన ఉదాహరణలు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం. దళపతి సినిమా టైంలో అరవింద్ స్వామి.. అప్పుడప్పుడే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి రాణిస్తున్నారు. ఆ టైంలో రజినీకాంత్ పెద్ద స్టార్ హీరోగా సక్సెస్ సాధించి భారీ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. ఆ టైంలో అనుకోకుండా అరవింద్ స్వామి.. రజని రూమ్ లోకి వచ్చి తన గది అనుకుని బెడ్ పై నిద్రపోయాడట. అయితే ఆ తర్వాత వచ్చిన రజనీకాంత్ చూసి.. ఎవరు ఆయనను లేపొద్దని చెప్పి నేలపై పడుకున్నారట.

Viral story: Thalapathy's brothers to reunite after 31 years...Major update  from Thalaivar 170! | The New Stuff

ఆ తర్వాత అరవింద్ స్వామి అతన్ని క్షమించమని అడగబోతుంటే.. చిరునవ్వు నవ్వి వద్దని చెప్పాడట. అలాంటి ఇన్సిడెంట్ మరో సందర్భంలో జరిగింది. ఆయన తీర్థయాత్రలో ఉండగా ఎలాంటి మేకప్ లేకుండా తెల్ల‌ జుట్టుతో మిడిల్ క్లాస్ మనిషి కన్నా కూడా తక్కువగా కనిపించాడట. అక్కడ ఉన్న ఓ మహిళ అతని బిచ్చగాడు అనుకుని పది రూపాయలు నోటు చేతిలో పెట్టి వెళ్లిపోయారట‌. ఆ తర్వాత ఆయన కారు ఎక్కుతున్న టైంలో రజినీకాంత్ అని గుర్తుపట్టిన ఆ మహిళ వెర‌కు వ‌చ్చి క్షమాపణ చెప్పడానికి చూస్తే.. పర్వాలేదు అంటూ దండం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారట. అలానే తమ ఇద్దరి కూతుళ్ళు సినీ ఇండస్ట్రీ లోకి వచ్చినా కూడా ఏ రోజు ఆయన వారి సినిమాలపై ప్రచారం చేయాలని అనుకోలేదు.

తమ పిల్లలు పెద్ద స్థాయికి వెళ్లాలని అండగా రజిని ఉండి ప్రచారం చేయాలని, పబ్లిసిటీ దక్కాలని ఎప్పుడు భావించలేదు. వారి సొంత కష్టంతో స్వతహాగా వారు ఎదగాలని రజిని భావించారు. అయితే ఇప్పటికీ ఏ సినిమా షూటింగ్ జరుగుతున్న.. మూవీ షూటింగ్ విషయాలలో వేలు కూడా పెట్టలేదని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఫ్రమ్‌ బస్ కండక్టర్ టూ సూపర్స్టార్ అనే పేరుతో ఆయన జీవిత గాధ పుస్తకాల్లో పాఠ్యాంశంగా ముద్రించబడింది. దీన్నిబట్టి రజనీకాంత్ సింప్లిసిటీ ఏంటో అర్థమై ఉంటుంది. అయితే ఇప్పటివరకు రజనీకాంత్‌ని సింప్లిసిటీ మ్యాటర్ లో ఇండ‌స్ట్రీలో ఏ హీరో కూడా టచ్ చేయలేకపోయారు.