సుకుమార్ నోట నుండి ఊహించని మాట..షాక్ అవుతున్న ఫ్యాన్స్.. ఏమైంది సార్ మీకు..?

సుకుమార్ .. ప్రజెంట్ పాన్ ఇండియా స్థాయిలో మారుమ్రోగిపోతున్న పేరు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్గా మారిపోయిన సుకుమార్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . అంతేకాదు రీసెంట్గా బన్నీ బర్త్డ డే సందర్భంగా రిలీజ్ అయిన టీజర్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకునేసింది . ఈ సినిమా పాన్ ఇండియా కాదు గ్లోబల్ స్థాయిలో రికార్డ్స్ బద్దలు కొట్టబోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేసేలా చేసాడు సుకుమార్ . రీసెంట్ గా సోషల్ మీడియాలో సుకుమార్ మాట్లాడిన మాటలు బాగా వైరల్ గా మారాయి .

సుకుమార్ కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా రంగస్థలం . చరణ్ హీరోగా సమంత హీరోయిన్గా నటించిన ఈ మూవీకి సంబంధించి కొన్ని వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి . ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ మాట్లాడుతూ..” అసలు హీరోయిన్ సమంత ఈ పాత్రకు సూట్ అవుతుంది అని నేను అనుకోలేదు అని.. నా మైండ్లో కేవలం చరణ్ మాత్రమే ఉన్నాడు అని రామలక్ష్మి పాత్ర కోసం వేరే హీరోయిన్ చూస్ చేసుకున్నాను అని ..కానీ సమంత ఆ ప్లేస్ లోకి వచ్చి నా అంచనాలను తలకిందులు చేసింది అని ..సమంత అలా నిజంగానే బర్రెను పట్టుకోవడం పల్లెటూరి స్టైల్ లో మెప్పించడం చేస్తుందని అస్సలు ఊహించలేకపోయాను అని” చెప్పుకొచ్చాడు .

 

అంతేకాదు “నేను సినిమాలు చేస్తున్నంతవరకు సమంతను ఏదో ఒక పాత్ర ఇస్తూనే ఉంటాను అంటూ చెప్పడం షాకింగ్ అనిపించింది”. నిజానికి సమంత కంటే చాలా చాలా టాలెంట్ ఉన్న హీరోయిన్స్ మన ఇండస్ట్రీలో బోలెడు మంది ఉన్నారు . కానీ ఎందుకు సుకుమార్ హీరోయిన్ సమంత ఈ రేంజ్ లో పొగిడేసారా..? అంటూ చర్చించుకుంటున్నారు జనాలు. ఏమో దానికి కారణం సుకుమార్ చెప్తేనే బాగుంటుంది అంటూ మరికొంతమంది వ్యంగ్యంగా వెటకారంగా ట్రోల్స్ చేస్తున్నారు..!!