ఎన్టీఆర్ తండ్రిగా ఆ స్టార్ హీరో నా..? నందమూరి ఫ్యాన్స్ కి బీపి పెంచేస్తున్న వార్త..!

జూనియర్ ఎన్టీఆర్ ..మల్టీ టాలెంటెడ్ హీరో.. ఎలాంటి స్టెప్స్ అయినా అవలీలగా వేసేస్తాడు . ఎలాంటి డైలాగ్స్ అయినా గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తాడు . ఇండస్ట్రీలో ఇలాంటి హీరో ఉండటం చాలా చాలా రేర్ .. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం ..నచ్చితే పని చేయడం నచ్చకపోతే స్కిప్ చేసే హీరోలు చాలా తక్కువ మన ఇండస్ట్రీలో.. అలాంటి హీరో ఉండటం మనకే గర్వకారణం . రీసెంట్గా ఎన్టీఆర్ టిల్లు స్క్వేర్ ఈవెంట్లో మాట్లాడాడు . దానికి సంబంధించిన పిక్స్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి .

 

అయితే ఇదే క్రమంలో ఎన్టీఆర్ నెక్స్ట్ నటిస్తున్న వార్ 2 సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి . కీయర అద్వానీ .. షర్వాణి హీరోయిన్స్ గా నటిస్తున్న వార్ 2 సినిమాను అయాన్ ముఖర్జీ డైరెక్టర్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే . ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ ఈ సినిమాలో కలిసి నటించబోతున్నారు. అయితే ఎన్టీఆర్ కి తండ్రి పాత్రలో జగపతిబాబు కనిపించబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి .

ఇదే విషయాన్ని రీసెంట్గా జగపతిబాబును ప్రశ్నించగా ఈ రూమర్స్ కి క్లారిటీ ఇచ్చాడు జగపతిబాబు “ఈ రూమర్ నేను కూడా విన్నాను ..కానీ నాకు వార్ 2 నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదు అదైతే ప్రస్తుతానికి రూమరే”.. అంటూ కొట్టి పడేసాడు. అయితే నిజానికి ఎన్టీఆర్ జగపతిబాబుల కాంబో బాగుంటుంది అని మరి ఎందుకు మేకర్స్ వాళ్ళిద్దర్నీ చూస్ చేసుకోవడం లేదు అంటూ చెప్పుకొస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ పాత్ర చనిపోతుంది అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే అదంతా రూమర్ అంటూ కొట్టి పడేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. ఈ వార్తతో ఎన్టీఆర్ అభిమానులు బీపీ పెంచేస్తున్నారు కొందరు ఆకతాయిలు..!!