వామ్మో.. జాన్వీకి పెళ్లి అయిపోయిందా..? సీక్రేట్ లీక్ చేసిన మెడలో తాళి..!?

జాన్వి కపూర్ ..సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతున్న పేరు . అతిలోకసుందరిగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీదేవి ముద్దుల కూతురే ఈ జాన్వి కపూర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి దేవర అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తుంది . ఆ తర్వాత రాంచరణ్ తో ఓ సినిమాకి కూడా కమిట్ అయింది . రీసెంట్గా జాన్వి కపూర్ కి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాలీవుడ్ టాలీవుడ్ మీడియాని షేక్ చేస్తుంది జాన్వీ కి పెళ్లి అయ్యిపోయిందట.

అయితే అనఫీషియల్ గా ఈ విషయాన్ని జాన్వి కపూర్ అలాగే బోని కపూర్ కూడా కన్ఫామ్ చేసేసారు. పలు ఈవెంట్స్ లో బాయ్ ఫ్రెండ్ శిఖర్ తో కలిసి తిరగడం బయట పబ్లిక్ గానే క్లోజ్గా మూవ్ అవుతూ ఉండటం..వీళ్లకి పెళ్లి అయిపోయింది అనే సంకేతాలు ఇస్తున్నాయి . అయితే మంగళవారం రాత్రి తండ్రి బోని కపూర్ ప్రొడక్షన్ హౌస్ లో నిర్మించిన మైదాన్ సినిమా ప్రదర్శనకు జాన్వి కపూర్ అటెండ్ అయింది . చాలా స్టైలిష్ గా ట్రెండీగా రెడీ అయింది .

అయితే ఈ క్రమంలోనే ఆమె మెడలో వేసుకున్న నక్లెస్ కి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ గా మారాయి . ఆ నెక్లెస్ ని చాలా కష్టమైజ్ చేసి డిజైన్ చేయించుకుందట . ఆ నెక్లెస్ పై శిఖర్ అనే పేరు కూడా ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది . ఇలాంటివి సాంప్రదాయంగా ఫాలో అవుతూ భార్యలు చేస్తూ ఉంటారు . అయితే ఆమె మెడలో ఇలాంటి నెక్ సెట్ చూసిన తర్వాత అభిమానులకు కొత్త డౌట్లు వచ్చేసాయి .

వీళ్ళకు పెళ్లి అయిపోయింది అంటూ గతంలో ప్రచారం జరిగింది . అందుకే వాళ్ళు తిరుమల కి కూడా జంటగా వెళ్తున్నారు అంటూ బాగా వార్తలు వినిపించాయి. నిజంగానే జాన్వీ కపూర్ కి పెళ్లయిపోయిందా ..? అందుకే తాళిగా భావించి శేఖర్ పేరు ఉన్న నెక్లెస్ ని మెడలో ధరించిందా..? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ ధరించిన ఈ నెక్ సెట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. చూద్దాం జాన్వీ కపూర్ దీనిపై ఎలా స్పందిస్తుందో..?