సినీ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకటేష్ కు ఎక్కువగా పాపులారిటీ ఉంది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఆయన చేసిన ఫ్యామిలీ సినిమాలు ప్రతి ఒక్కటి మంచి సక్సెస్ సాధించి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఇందులో భాగంగానే ఆయన ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయడంలో ఎప్పటికప్పుడు మరింత అప్డేట్ అవుతూ.. వరుస ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలలో.. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో నటిస్తూ వచ్చాడు. అలాగే ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా.. చిల్ మూమెంట్‌తో నటించే హీరోగా వెంకటేష్‌కు మంచి పేరు ఉంది.
అలాంటి వెంకటేష్ ఒకనొక టైం లో స్టార్ హీరోయిన్‌తో సెట్ లో అందరి ముందే.. గొడవ పడారట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఆ గొడవ ఏంటో.. ఒకసారి చూద్దాం. ఆమె ఎవరో కాదు దేవీపుత్రుడు మూవీలో వెంకటేష్ సరసన హీరోయిన్గా నటించిన అంజలి జవేరి. ఈ మూవీ షూటింగ్ టైంలో ఇద్దరు కలిసి ఓ చిన్న సీన్ చేస్తుండగా.. వెంకటేష్ ఆమెతో గొడవ పడాల్సి వచ్చిందట. దానికి కారణం ఆయన ఎన్నిసార్లు డైలాగ్స్ సనివేశానికి తగ్గట్టు పర్ఫెక్ట్ గా చెప్పినా.. ఆమె మాత్రం టేక్‌లపై టేక్‌లు తీసుకోవడంతో వెంకటేష్ ఆమెపై కోప్పడినట్లు.. అప్పట్లో ఆమెతో గొడవ జరిగినట్లు వార్తలు వినిపించాయి. వెంకటేష్‌కు ఎక్కువసేపు ఒకే సీన్ చేయడం అంటే చాలా చిరాకట. అప్పటికే ఆయన పది టేకులలో నటించారట.
కాంబినేషన్ సీన్స్ కావడంతో ఇద్దరు పర్ఫెక్ట్ గా చేస్తేనే సీన్ బాగా వస్తుంది. దీంతో ఇద్దరు మొదటి నుంచి ఈ సినిమా చేస్తూ వచ్చారట. అలా పదిటేక్‌లు తీసుకున్న కూడా.. ఆమె పర్ఫెక్ట్ గా డైలాగ్ చెప్పకపోవడంతో.. వెంకటేష్ ఆమెపై కోప్పడినట్లు తెలుస్తుంది. దీంతో ఆమెతో 12వ టేక్ ఓకే చేసి ఆ సీను ఫినిష్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే వెంకటేష్ ఇప్పటికీ వరుస సినిమాలో నటిస్తూ భారీ పాపులారిటీతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వెంకటేష్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే వీరి కాంబోలో ఎఫ్ 2 , ఎఫ్ 3 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకులలో ఆవక్తి నెతకొంది. ఈ మూవీ కూడా హిట్ కొడితే.. వీరిద్దరు కాంబోలో హ్యాట్రిక్ పడినట్లే.