2030లో ఎన్టీఆర్ సీఎం అవ్వడం పక్కా.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..!

నందమూరి తారక రామారావు వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. స్వయంగా తన తాత పేరునే నామకరణం చేసుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన తాత అంతా పెద్ద హీరోగా ఎదిగాడు ఎన్టీఆర్. త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయిపోయిన తారక్ ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకప్పుడు తారక్ ఒకపక్క సినిమాలతో పాటు మరోపాక పాలిటిక్స్ లో కూడా ఉండేవాడు.

కానీ ప్రస్తుత కాలంలో వారి కుటుంబాల మధ్య రేగిన కలహాలు కారణంగా వీరు టిడిపికి మద్దతుగా నిలవడం లేదు. ఇక ప్రతి ఒక్కరు కోరుకునే ఏకైక కోరిక ఎన్టీఆర్ సీఎం కావాలని. జూనియర్ ఎన్టీఆర్ కనుక సీఎం గా పోటీ చేస్తే బాగుంటుందని తన ఫ్యాన్స్ తో పాటు సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ఇది ఎప్పుడు నెరవేరుతుందా అని 100కళ్ళతో ఎదురుచూస్తున్నారు. తాజాగా వేణు స్వామి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తుపై కామెంట్స్ చేశాడు.

ఎప్పుడు అనేక కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వేణు స్వామి మాట్లాడుతూ..” 2029కి కూడా ఎన్టీఆర్ ఎలక్షన్స్ లోకి రాడు. ఎందుకంటే ఆయనకి ఒక యోగం ఉంది. జయలలిత పెద్ద ఎన్టీఆర్ జాతకం కలిస్తే వస్తాడు. కచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్కు రాజుయోగం ఉంది. తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర ప్రదేశ్ సీఎం అవుతాడు. 2030 నా అవుతాడు. 2029 కి అయితే రాడు. 2030 కి రాజకీయాల్లోకి వచ్చి ఖచ్చితంగా సీఎం అవుతాడు. అది టిడిపి తరఫున ఇతర పార్టీ తరపున అనేది మనం చెప్పలేం ” అంటూ చెప్పుకొచ్చాడు వేణు స్వామి. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.