ఆ స్టార్ హీరో కోసం దేన్నైనా వదులుకోవడానికి నేను రెడీ.. ప్రియుడిపై ప్రేమని బయటపెట్టిన ప్రియమణి..!

హీరోయిన్ ప్రియమణి ఒకప్పుడు టాలీవుడ్ హీరోల సరసన నటించి తన నటనను నిరూపించుకుంది ఈ ముద్దుగుమ్మ. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకి దూరమైంది. కొద్ది రోజుల క్రితమే బుల్లితెర షోలో ప్రత్యక్షమైంది ప్రియమణి.

అక్కడి నుంచి ఈమె రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి తన సత్తా చాటుతుంది. ప్రస్తుతం ప్రియమణి నటించిన తాజా చిత్రం మైదాన్. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రియమణి ఓ స్టార్ హీరో పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేసింది. ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ..” బాలీవుడ్ బాద్ షో షారుక్ ఖాన్ కోసం ఏదైనా వదులుకోవడానికి రెడీగా ఉన్నాను.

ఒకవేళ ఆయన నాకు ఫోన్ చేసి సినిమా చేద్దామంటే.. ఏదైనా సరే వదులుకొని వెళ్తాను. ఈ విషయాన్ని మీడియా వారే షారుక్ దగ్గరకు తీసుకువెళ్లాలి ” అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ప్రియమణి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.