పిఠాపురంలో పవన్ కు పోటీగా ఓ ట్రాన్స్ జెండర్.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?!

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయ‌న‌కు పోటీగా ట్రాన్స్ జెండ‌ర్ తమన్న సింహాద్రి పోటీ చేస్తున్నారంటూ తెలుస్తోంది. గతంలో లోకేష్ పై పోటీ చేసి వార్తల్లో నిలిచిన ఈ అమ్మడు.. ఈసారి ఎన్నికల్లో భారతీయ చైతన్య యోజన పార్టీ నుంచి జనసేనకు పోటీగా నిలబడునున్నారు. బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ తాజాగా ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. చట్టసభలో ట్రాన్స్ జెండర్స్ కు ప్రాతినిధ్యం ఉండాలి.. వారికి అవకాశం దక్కాలని ఆలోచనతో తమన్న సింహాద్రికి అవకాశం కల్పించినట్లు ఆయన వివరించాడు.

Transgender Person Tamanna to Contest From Pithapuram

ఇక ఈమె స్వస్థలం విజయవాడ కాగా.. గ‌తంలో తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకుంది. గతంలో బిగ్ బాస్ లో సందడి చేసిన తమన్న.. కొంతకాలం జనసేనలో కూడా పనిచేసింది. అయితే జనసేనాని నుంచే టికెట్ ఆశించినా తమన్నాకు టికెట్ దక్కలేదు. కొంతకాలం క్రితం ట్రాన్స్ జెండర్ కావడం వల్ల నాకు టికెట్ దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. చంద్రబాబు బాబు కోసం.. పవన్ కళ్యాణ్ ఆయనను అభిమానించే వాళ్ళందరినీ నాశనం చేశాడని.. తమన్నా సింహాద్రి చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్.. నాదెండ్ల మనోహర్ మాటలు మాత్రమే వింటున్నారని వివరించింది.

పవన్ సీఎం కావాలని అభిమానులు భావిస్తుంటే.. ఆయన మాత్రం బాబును సీఎం చేయాలని కష్టపడుతున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. పవన్ లాంటి వాళ్లు కూడా కోట్ల రూపాయలు తీసుకుని టికెట్లు ఇస్తే.. మాలాంటి వాళ్లకు న్యాయం ఎలా జరుగుతుందంటూ వాపోయింది. ఇక ప్రస్తుతం తమన్న, పవన్ కళ్యాణ్ కు పోటీగా బరిలో దిగడం నెట్టింట వైరల్ గా మారింది. ఒక ట్రాన్స్ జెండర్.. పవన్ కళ్యాణ్ లాంటి స్ట్రాంగ్ నాయ‌కుడికి పోటీగా నిలవడంతో ఈమెకు ఎన్ని ఓట్లు వస్తాయి.. ఎంతమంది ఎన్నికల్లో ఆమెకు సపోర్ట్ గా ఉంటారనే అంశంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది.