పుష్ప 2 టీజర్: ఆ ఒక్క షాట్ కోసం బన్నీ అన్ని టేకులు తీసుకున్నాడా..?

పుష్ప .. పుష్ప రాజ్ .. ఎన్నిసార్లు ఈ డైలాగ్ చెప్పుకున్న తనివి తీరదు. ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ఇంకా చెప్పాలి అనిపిస్తూ ఉంటుంది . అలాంటి ఓ గూస్ బంప్స్ డైలాగ్. సినిమా రిలీజ్ అయ్యి సంవత్సరాలు అయిపోతుంది . అయినా సరే ఈ సినిమాలో ఈ డైలాగ్ ఉన్న పవర్ మాత్రం తగ్గడం లేదు . అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమా పుష్ప ది రైజ్..

ఈ సినిమాలో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కెవ్వు కేక ఇరగదీసాడు అనే చెప్పాలి . ఈ సినిమాకి సిక్వెల్ గా వస్తున్న పుష్ప2 సినిమాకి సంబంధించిన టీజర్ ను రీసెంట్ గానే రిలీజ్ చేశారు మేకర్స్. బన్నీ బర్త డే సందర్భంగా రిలీజ్ అయిన పుష్ప2 టీజర్ అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకునేసింది. అంతేకాదు ఈ సినిమాపై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచేలా చేసుకున్నింది.

ఈ టీజర్ లో అల్లు అర్జున్ చీర కట్టులో కనిపిస్తాడు . అంతేకాదు చీర కట్టులో ఫైట్ చేయడం సినిమాకి హైలైట్ గా మారబోతుంది . అయితే ఈ షాట్ కోసం అల్లు అర్జున్ ఏకంగా 51 టేకులు తీసుకున్నాడట . ఆయన కెరియర్ లోనే ఇన్ని టేకులు తీసుకున్న ఫస్ట్ సీన్ ఇదే కావడం గమనార్హం. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా పుష్ప2 సినిమా ఆగస్టు 15వ తేదీ 2024 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం కొట్లాదిమంది బన్నీ ఫ్యాన్స్ అలాగే స్టార్ సెలబ్రిటీస్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!