రష్మిక బర్త డే స్పెషల్: ఏ హీరోయిన్ లో లేని స్పెషల్ టాలెంట్ ఈమెలో ఉంది తెలుసా..?

రష్మిక మందన్నా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఓ స్టార్ హీరోయిన్ . ఛలో అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఎన్నో సినిమాల్లో నటించి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా పుష్ప సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకుని సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేసింది.

ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు ఎలా హిట్ అయ్యాయో మనం చూసాము. త్వరలోనే పుష్ప2తో బిగ్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోబోతుంది . ఈరోజు రష్మిక మందన్నా బర్త్ డే . ఈ క్రమంలోనే ఆమెకు బెస్ట్ విషెస్ అందిస్తున్నారు ఆమె ఫ్యాన్స్. అంతేకాదు పలువురు సినీ ప్రముఖులు కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేస్తున్నారు.

ఈ క్రమంలోని రష్మిక మందన్నాలో ఉన్న స్పెషల్ టాలెంట్ బయటపడింది . రష్మిక మందన్నా కన్నడ అమ్మాయి అయినప్పటికీ 12 భాషలు అవలీలగా మాట్లాడగలరట . మొదటి నుంచి రష్మిక చూసింది చూసినట్లు పట్టేస్తూ వస్తుందట . డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజస్ నేర్చుకోవాలన్న కోరిక ఆమెకు ఎక్కువగా ఉంటుందట . అందుకే ఆమె ఎక్కువగా లాంగ్వేజెస్ పై ఫోకస్ చేస్తూ ఉంటుందట . ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కి కూడా 12 భాషలు మాట్లాడడం రాదు అంటూ రష్మిక లోని స్పెషల్ టాలెంట్ ను ట్రెండ్ చేస్తున్నారు రష్మిక ఫ్యాన్స్..!!