నాగచైతన్య కోసం రంగంలోకి ఆ స్టార్.. ఇక రాజులమ్మ జాతర షురూ..!!

ప్రస్తుతం నాగచైతన్య చందు మండేటి డైరెక్షన్లో తండేల్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బంగార్రాజు సినిమా తర్వాత నాగచైతన్యకు ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు. ప్రస్తుతం నటిస్తున్న తండేల్‌ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు అక్కినేని హీరో. కాస్త రా అండ‌ఖ రెస్టిక్ క్యారెక్ట‌ర్‌లో ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన పనులు ప్రారంభమైనప్పటి నుంచి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాల నెలకొన్నాయి.

ఈ సినిమా స్టోరీ నిజంగా జరిగిన స్టోరీ ఆధారంగా రూపొంద‌టం అది కూడా ఇండియా, పాకిస్తాన్ మధ్య వివాదాస్పద అంశం మీద సినిమా రూపొందుతుండడంతో ప్రేక్షకుల్లో మరింత హైప్ నెలకొంది. ఈ అంచనాలకు తగ్గట్టుగానే మరింత హైప్‌ పెంచే విధంగా న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి సినిమాలో హీరోయిన్గా తీసుకున్నారు. ఇప్పుడు నాగచైతన్య కోసం మరో కీలకమైన నిర్ణయాన్ని టీం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఉన్న ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ కోసం ఫేమస్ స్టంట్ మాస్టర్ ని రంగంలోకి దించారని టాక్.

ఆయన ఎవరో కాదు మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్ప మనం కోసియం సినిమాతో పాటు ఇటీవల వ‌చ్చిన యానిమల్ సినిమాకు స్టంట్ మాస్టర్ గా పనిచేసిన సుప్రీంసుందర్. ఆయన పర్యవేక్షణలోనే నాగచైతన్యఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారట మేకర్స్. అది ఒక్క రేంజ్ లో ఉంటుందని.. సినిమాకు ఆ ఫైట్స్ హైలెట్గా నిలవ‌నుంద‌ని తెలుస్తుంది. ఈ సన్నివేశం వచ్చినప్పుడు థియేటర్లలో ప్రేక్షకులు అంత ఈ సన్నివేశాలను ఎంజాయ్ చేసే విధంగా తీర్చిదిద్దుతారని తెలుస్తుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ సమర్పణ‌లో ఈ మూవీ రూపొందుతుంది.