మన రౌడీ హీరోని రష్మిక ముద్దుగా అలా పిలుస్తుందా?.. పాప టూ రొమాంటిక్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరో గా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండ అనంతరం గీతాగోవిందం సినిమాతో లవ్లీ బాయ్గా పేరు సంపాదించుకున్నాడు. రష్మిక మందనాతో ప్రేమాయణం నడుపుతున్నాడంటూ అప్పటినుంచి వార్తలు మొదలయ్యాయి. ఇక వీరిద్దరికీ సంవత్సరానికి కనీసం మూడుసార్లు అయినా పెళ్లి చేస్తున్నారు ప్రేక్షకులు.

త్వరలోనే వీరిద్దరి పెళ్లి ఉండనుంది అంటూ అనేక రూమర్స్ పుట్టిస్తున్నారు. ఇక వీటికి తగ్గట్లుగానే రష్మిక సైతం విజయ్ దేవరకొండ బట్టలను వేసుకుంటూ తిరుగుతూ ప్రతి ఒక్కరికి షాపిస్తుంది. ఇక ఈ రూమర్స్ పై ఇప్పటివరకు అయితే వీరిద్దరూ స్పందించలేదు. ఇక తాజాగా బాలీవుడ్ స్టార్ నేహా ధుపియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది రష్మిక. విజయ్ దేవరకొండలో నచ్చే క్వాలిటీ ఏంటి? నచ్చని క్వాలిటీ ఏంటి? అని అడగగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది ఈ నేషనల్ క్రష్.

విజయ్ దేవరకొండ తాను ఇద్దరం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చామని దీంతో ఇద్దరి ఆలోచనలు చేసే పనులు ఒకేలా ఉంటాయని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. ఇక తనకి విజయ్ దేవరకొండలో ఉండే కాన్ఫిడెన్స్ అంటే ఇష్టమని వెల్లడించింది. ఇక నచ్చని విషయాన్ని చెబుతూ.. ఎప్పుడూ ఏదో ఒక వర్చ్ చేస్తూ.. వర్క్ విషయంలో సీరియస్ గా ఉండడని తెలిపింది. ఇక తాను విజయ్ ని రౌడీ అని పిలుస్తున్నట్లు కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.