ఈ సింపుల్ టిప్స్ ఉపయోగించి టమాటో చారు తయారు చేస్తే.. ఆ మజానే వేరు..!

ప్రస్తుతం ఉష్ణోగ్రతల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. వేసవికాలంలో ఏ ఆహారం తీసుకున్న సరిగా తినలేము. ఆకలి కూడా పెద్దగా ఉండదు. ఉష్ణోగ్రతలను తట్టుకుని ఉండడానికి చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న సమయంలో తినేందుకు గాను పప్పుచారు మరియు టమాటా చారు వంటివి తయారు చేసుకుంటూ ఉంటారు. అవి అయితే తొందరగా తినవచ్చు అని ఉద్దేశంతో వీటిని తయారు చేస్తారు.

అదేవిధంగా ఈ ఉష్ణోగ్రతలలో పెద్దగా భారీ భారీ కురలు ఉండేందుకు ఎవరు సిద్ధపడరు. ఇక ఎక్కువగా టమాటా చారుని ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కానీ కొందరికి దీనిని తయారు చేయడం పెద్దగా తెలియదు. వారి గురించే ఈ వార్త. సింపుల్ టిప్స్ ని ఉపయోగించి టమాటో చారిని పెట్టవచ్చు. మరి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. టమాటో చారుకి కావాల్సిన పదార్థాలు.. టమాటాలు, పచ్చిమిర్చి, పసుపు, చింతపండు, జీలకర్ర, రసం‌ పౌడర్, కరివేపాకు, ధనియాల పొడి, నెయ్యి, నీళ్లు, ఉప్పు తగినంత. ముందుగా టమాటో చారు తయారు చేయడానికి టమాటాలను కడిగి ముక్కలుగా కోసుకోండి. అనంతరం ఓ పాత్రలో నీళ్లు పోసి చింతపండును నాన్న పెట్టండి.

ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఇక ఆ తరువాత అందులోనే పచ్చిమిర్చి, టమోటో ముక్కలు వేసి ఐదు నిమిషాల పాటు వేయించాలి. టమాటాలు దగ్గర అయ్యేదాకా వేయించాలి. టమాటోలు బాగా ఉడికిన అనంతరం అందులో పసుపు, ధనియాల పొడి, రసం పోసి బాగా కలపాలి. ఇక ఆ తరువాత తగిన ఉప్పు వేసి ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి. చివర కొత్తిమీరను వేసుకుని దింపేస్తే ఎంతో రుచికరమైన టమాటో రసం మీ సొంతం చేసుకోవచ్చు.