పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా.. ఇప్పుడు ఈమె క్రేజ్ వేరే లెవెల్..!

ప్రస్తుత కాలంలో ఒకప్పుడు ఇండస్ట్రీలో కొనసాగిన వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. ఇక పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా ఈ కోవాలోకి చెందినదే. ఈమెకి అందం మరియు అభినయం ఎంత ఉన్నా అదృష్టం కలిసి రాకపోవడంతో పెద్దగా ఈమెకి అంతగా గుర్తింపు రాలేదు. ఈమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది.

ఇక అనంతరం కొన్నాళ్లపాటు సినిమాల్లో కనిపించలేదు. ఇక మరో పక్క సోషల్ మీడియాలో కూడా కొంచెం సైలెంట్ అయిపోయింది. ఇక ఆ తరువాత పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సినిమాతో ఫేమస్ అయ్యింది. ఇక ఆమె ఎవరో ఇప్పటికైనా గుర్తించారా? ఆమెనండి కన్నడ భామ నభా నటేష్. 2019లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తర్కెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఓవర్ నైట్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కొంచెం జోరు తగ్గించింది.

ఇక అనంతరం డిస్కో రాజా సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాల్లో కనిపించినప్పటికీ అంతగా పాపులారిటీ రాలేదు. ఇక తాజాగా ఈ బ్యూటీ క్రేజీ ఛాన్స్ కొట్టేసింది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ స్వయంభు మూవీలో ఈమె నటిస్తుంది. ఇక పైన ఫోటో కూడా ఈ ముద్దుగుమ్మదే. ప్రస్తుతం ఈమె చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.