రూ. 15 రూపాయల చీరలో అందాలను ఆరబోసిన స్టార్ హీరోయిన్.. అలా ఎలా అంటున్న నెటిజన్స్..!

హీరోయిన్ అదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈమె తెలుగులో చాలా తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈమెకు తెలుగు అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. అక్కడ మాత్రం ఈ అమ్మడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు చేస్తూ దూసుకుపోతుంది.

ఇక ఈ హీరోయిన్ ఎప్పటికప్పుడు మీడియా కంటకి చిక్కుతూ తన అందచందాలను ఆరబోస్తూ ఉంటుంది. అంతేకాకుండా తన చీరలను చూపిస్తూ ఇది మా అమ్మ చీర లేదా అమ్మమ్మ చీర అంటూ ప్రతి ఒక్కరి మనసులను గెలుచుకుంటుంది. ఇక తాజాగా ఇదే క్రమంలో ఎయిర్పోర్టులో మీడియా కంటికి చిక్కి తన చీర గురించి వివరించింది.

ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈ ముద్దుగుమ్మను ఓ యువకురాలు మీ చీర ధర ఎంత అని అడగగా దానికి ఈమె సమాధానం ఇస్తూ..రూ.15 రూపాయలు అని చెప్పుకొచ్చింది. దీంతో ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. ఈ రోజుల్లో ఈ డబ్బుకి ఏమి రావడం లేదు. అటువంటిది ఈమె ఏకంగా ఓ చేరే కొనిందా అంటూ షాక్ అవుతున్నారు. అయితే ఈ చీర వాళ్ళ నాన్నమ్మది అయినట్లు తెలుస్తుంది. ఆ రోజుల్లో ఈ చీర ధర 15 రూపాయలు. ఇక ఆ చీరని ఈమె ధరించి ప్రస్తుతం తన అంద చందాలను ఆరబోసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.