అటువంటి సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన బిగ్ బాస్ బోల్డ్ బ్యూటీ.. హల్ చల్ చేస్తున్న పోస్ట్..!

బిగ్ బాస్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అరియానా ఒకరు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ తో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ ని దక్కించుకుంది. ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో అడుగుపెట్టి ప్రతి ఒక్కరికి మరోసారి తన అంద చందాలను గుర్తుచేసింది.

ప్రస్తుతం పలు షోస్ కి యాంకరింగ్ చేస్తూ మరోపక్క యూట్యూబ్ వీడియోలను రన్ చేస్తూ తన జీవనాన్ని సాగిస్తుంది. ఇక సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే అరియానా తన అంద చందాలతో కుర్రాళ్ళని ఆకట్టుకుంటుంది. ఇక ఈమెకు సంబంధించిన ప్రతి విషయం కూడా తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తూ ప్రతి ఒక్కరికి ట్వీట్ ఇస్తుంది. ఇక తాజాగా ఆసుపత్రికి వెళ్లినట్లు ఓ పోస్ట్ ని పెట్టింది.

దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ ఆధారంగా ఈమె దంత సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే డెంటిస్ట్ ను సంప్రదించిన ఈమె ఆ డాక్టర్కు థాంక్యూ చెబుతూ ఓ పోస్ట్ ని పెట్టింది. ఆ డాక్టర్ తనకు ఎంతో చక్కగా ట్రీట్మెంట్ గురించి వివరించారని మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చాడని పోస్టులో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.