అప్ప‌టినుంచి నాకు నేనే అలాంటి శిక్ష వేసుకున్న.. రౌడీ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ?!

ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఫ్యామిలీ స్టార్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మృణాల్‌ ఠాగూర్ హీరోయిన్ గా పరుశురాం డైరెక్షన్‌లో తెర‌కెకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 5న (నేడు) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే నిన్న మొన్నటి వరకు సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగాయి. ఈ వేడుకల్లో విజయ్ దేవరకొండ సినిమాకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను ఆడియ‌న్స్‌తో షేర్ చేసుకున్నాడు. దీంతో పాటు ఆయన లైఫ్ లో ఓ శిక్ష‌ తనకు తానుగా వేసుకున్నాను అంటూ వివరించాడు.

ఇంతకీ రౌడీ స్టార్ మాట్లాడింది దేని గురించి.. ఏం శిక్ష వేసుకున్నాడు అనుకుంటున్నారా..విజయ్ దేవరకొండ.. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో లైగ‌ర్ సినిమా తర్వాత తన లైఫ్ లో జరిగిన మార్పుల గురించి షేర్ చేసుకున్నాడు. పూరి జగన్నాధ్‌ డైరెక్షన్లో విజయ హీరోగా లైగర్ సినిమాలో న‌టించిన‌ సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. అప్పట్లో విజయ్‌ మాటతీరుపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువ‌డ్డాయి. దీనిపై తాజాగా విజయ్ రియాక్ట్ అయ్యారు. విజ‌య్‌ మాట్లాడుతు లైగర్‌కు ముందు.. తర్వాత తన తీరులో ఎలాంటి మార్పూ లేదనీ.. కాకపోతే ఓ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త పడుతున్నాననీ వివ‌రించాడు.

రిలీజ్‌కు ముందే దాని ఫలితం గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాన‌ని.. నాటి నుంచి అదే అమలు చేస్తున్నాన‌ని చెప్పుకొచ్చాడు. ఇది నాకు నేనే వేసుకున్న‌ శిక్ష అని వెల్ల‌డించాడు. ఇక ఫ్యామిలీస్టార్‌ గురించి మాట్లాడుతూ.. మనకు ఏ కష్టం వచ్చినా.. ధైర్యం చెప్పే ఓ వ్యక్తి ప్రతి కుటుంబలో ఉంటారని ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్ అన్ని.. నా కుటుంబంలో అది మా నాన్న అంటూ చెప్పుకొచ్చాడు. దర్శకుడు ఈ కథ చెప్పగానే నాకు మా నాన్నే గుర్తొచ్చారనీ.. అందుకే ఆ పాత్రకు కూడా ఆయన పేరే పెట్టినట్లు తెలిపాడు. ఎందుకంటే ఆ పేరు పెట్టుకుంటే నాకు ఎమోషన్స్‌ పలికించడం సులువు అవుతుందనీ అనిపించింద‌ని చెప్పాడు. ఇక‌ నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ప్రస్తుతం యావ‌రేజ్ టాక్ ద‌క్కించుకుంది.