విజయ్ సేతుపతి, సాయి పల్లవి లో ఉన్న కామన్ పోలిక తెలుసా.. హ్యాట్సాఫ్ అనాల్సిందే..?!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, టాలీవుడ్ బ్యూటీ సాయి పల్లవిలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సాయి పల్లవి టాలీవుడ్ హీరోయిన్గా ఎన్నో సినిమాల్లో నటించి సక్సెస్ఫుల్‌గా రాణిస్తుంది. ఇక విజయ్ సేతుపతి కూడా పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో నాగచైతన్య హీరోగా తెర‌కెక్కుతున్న తాండేల్ సినిమాలో బిజీగా గడుపుతుంది. విజయ్ సేతుపతి తెలుగు ప్రాజెక్టులో ఎక్కువగా కనిపించకపోయిన.. తమిళ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. సాయి పల్లవి, విజయ్ సేతుపతిలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది.

Vijay Sethupathi schools reporter asking about Hindi imposition in Tamil  Nadu - Hindustan Times

ఈ క్రమంలో సాయి పల్లవి, విజయ్ సేతుపతి మధ్యన ఓ కామన్ పాయింట్ ఉంది అంటూ నిజంగానే వారిద్దరు గ్రేట్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ పోలిక ఏంటో ఒకసారి చూద్దాం. వీరిద్దరూ ఎంత పెద్ద స్టార్స్ గా పేరు సంపాదించుకున్నా చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా కథ నచ్చితేనే సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అయితే సినిమా బడ్జెట్‌కు అనుగూణంగా రెమ్యూనరేషన్ తీసుకుంటారని టాక్. వీరి నిర్ణయంతో నిర్మాతలపై భారం పడకూడదని ఇలాంటి డెసిషన్ తీసుకున్నారట. ఈ విధంగా ఇద్దరు ఎంతో గ్రేట్ అని ఫ్యాన్స్ వారిని అభినందిస్తున్నారు. సాయి పల్లవి మరోసారి తాండేల్‌తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Sai Pallavi - Wikipedia

ఇక ఈ సినిమాలో నాచురల్ బ్యూటీ పాత్ర చాలా కొత్తగా ఉండనుందని టాక్. చందు మొండేటి డైరెక్షన్లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో.. ఆమె రోల్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేక‌ర్స్‌. అయితే అధికారికంగా దీనిపై క్లారిటీ రాలేదు. సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు అందుకుంటూ బిజీ కావాలని.. వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీ మొత్తంలో ఎటువంటి వివాదాలకు లేకుండా అందరూ ఇష్టపడే ఏకైక హీరోయిన్గా సాయి పల్లవి పేరు సంపాదించుకుంది. విజయ్ సేతుపతి తెలుగులో కూడా మరిన్ని సినిమాలను ఎంచుకుంటూ నటించాలని ఆయన ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.