సెట్స్ పైకి రాకముందే రేర్ రికార్డు క్రియేట్ చేసిన మహేష్, జక్కన్న కాంబో.. అదేంటంటే..?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో ఆడియోన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకున్న మహేష్.. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో సినిమాను నటించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ అంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే మొదటి నుంచే ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంటుంది. దీంతో మహేష్ రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి, మహేష్ బాబు తో పాన్ వ‌ర‌ల్డ్‌ మూవీని తెర‌కెక్కిస్తున్నట్టు ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే.

SS Rajamouli reveals if Kevin Feige approached him for Marvel movie |  Bollywood - Hindustan Times

ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఏ సినిమా ఉండనుందని టాక్. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఎన్నో వార్తలు నెటింట‌ వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ అప్ కమింగ్ సినిమా కొత్త రేర్ రికార్డును సృష్టించి మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఆ రికార్డ్‌ ఏంటి అనుకుంటున్నారా.. రాజమౌళి మహేష్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కావడంతో సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించాలని ఆలోచనలో ఉన్నాడు జక్కన్న. దీంతో ఫస్ట్ డే నుంచి ఈ సినిమాపై రూమర్లు మొదలైపోయాయి. ఈ మూవీ గురించి ఇప్పటికే ఎన్నో పుకార్లు వచ్చాయి.

SS Rajamouli's father and screenwriter Vijayendra Prasad to direct film on  RSS soon: 'RSS has made one mistake...' | Entertainment News, Times Now

దీంతో రచయిత.. జక్కన్న తండ్రి.. విజయేంద్ర‌ప్రసాద్ మాట్లాడుతూ అడవి నేపథ్యంలో సినిమా ఉండనుంద‌ని క్లారిటీ ఇచ్చేశారు. హీరోయిన్ గురించి కూడా ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. దీంతో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదని.. రాజమౌళి ఇటీవల క్లారిటీ ఇచ్చాడు. అలాగే కేఎల్ నారాయణ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా అంతర్జాతీయ స్టూడియో తో కలిసి నిర్మించి మార్కెటింగ్ చేయనున్నారట. ఇలా ఇప్పటివరకు వచ్చే అన్ని సినిమాలలోకెల్లా అత్యధిక రూమర్స్ వచ్చిన మూవీగా మహేష్ – జక్కన్న కాంబో రికార్డా క్రియేట్ చేసింది.