వెంకీ, కిక్ సినిమాలను మించిపోయే కామెడీ జాన్నర్ తో మాస్ మహారాజ్.. డైరెక్టర్ ఎవరంటే..?!

మాస్ మహారాజ్ రవితేజ కు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలుసు. ఆయన నుండి ఓ సినిమా వస్తుందంటే ఫాన్స్ లో సందడి మొదలైపోతుంది. రవితేజ నుంచి సినిమా వస్తుందని అనౌన్స్మెంట్ మొదలైన దగ్గర నుంచే సినిమాపై హైప్‌ వేరే లెవెల్ కి వెళ్తుంది. ఇక ఆయన నుంచి వచ్చే సినిమాలన్నీ ఎక్కువగా కొత్త దర్శకులు రూపొందిస్తూ ఉండ‌టంతో మాస్ మ‌హ‌రాజ్ సినిమాల‌పై ఆడియ‌న్స్ మరింత ఆసక్తి చూపుతూ ఉంటారు. అసలు స్టార్ హీరో రేంజ్ లో ఉన్న వ్యక్తి న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడం అంటే అది నిజంగానే పెద్ద విషయం. ఒక సాహసం అని చెప్పాలి. ఇండస్ట్రీలో ర‌వితేజ‌ది.. మంచి త‌నం, గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకున్నే క్యారెక్టర్ అని అందరు చెప్తు ఉంటారు.

Here's all you need to know about Ravi Teja's next | Filmfare.com

ఇక అసలు విషయం ఏంటంటే రవితేజ మరోసారి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కు అవకాశం ఇస్తున్నాడని తెలుస్తుంది. శ్రీ విష్ణు నటించిన సామజ వరగ‌మన మూవీకి రైటర్ గా పని చేసిన భాను భోగవరపు చెప్పిన కథ రవితేజకు బాగా నచ్చిందని.. డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. ఈ సినిమాతో భాను భోగావరపు డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కథ పూర్తిగా కామెడీ జోనర్‌లో ఉండబోతుందట. ఇక గతంలో మాస్ మహారాజు నుంచి ఎక్కువ ఎంటర్‌టైనింగ్‌గా వచ్చిన సినిమాలు కిక్, వెంకీ సినిమాలను మించిపోయే కామెడీ జోనర్‌గా ఈ క‌థ ఉండ‌నుంద‌ని తెలుస్తుంది.

గత కొంతకాలంగా రవితేజ యాక్షన్ ఫిలిమ్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా.. కామెడీ కథతో రావాలని ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ కామెడీ జోనర్ సినిమాకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలియడంతో.. ఫాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టు నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రవితేజ కొత్త డైరెక్టర్లతో పని చేయడం ఇదేమి మొదటిసారి కాదు. అయితే రవితేజ అవకాశాలు ఇచ్చిన వారిలో చాలా కొంతమంది మాత్రమే సంపూర్ణ సక్సెస్ ఇచ్చారు. ఇక రవితేజ కోసం ఈ డబ్ల్యూ డైరెక్టర్ ఎలాంటి కథ అందించనున్నాడో వేచి చూడాలి. ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.