‘ ఫ్యామిలీ స్టార్ట్ ‘ ట్విట్టర్ రివ్యూ.. దేవరకొండ హిట్ కొట్టాడా.. తుస్సుమనిపించాడా..?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూత్ ఆలోచనలకు తగ్గట్టుగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న విజయ్ దేవరకొండ.. ఈ కారణంగానే అతి తక్కువ సమయం లోనే టాలీవుడ్ క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇక తాజాగా విజయ్ దేవరకొండ నటించిన మూవీ ఫ్యామిలీ స్టార్. గీతగోవిందం లాంటి బ్లాక్బస్టర్ తర్వాత పరుశురాం డైరెక్షన్లో ఈ సినిమా తెర‌కెక్కింది. దీంతో సినిమా పై మంచి హైప్ నెలకొంది. ఈ మూవీలో విజయ్ కి జోడిగా మృణాల్ ఠాగూర్ నటించింది. నేడు ఏప్రిల్ 5న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో ప్రేక్షకులు ముందుకు రానంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్, సాంగ్ ప్రతి ఒకటి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

దీంతో గీత గోవిందం లాంటి బ్లాక్‌బ‌స్టర్ పక్క అంటూ సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే మరోసారి గీతగోవిందం మ్యాజిక్ ను ఈ సినిమా రిపీట్ చేసిందో లేదో.. ఆడియన్స్ టాక్ ఎంటో చూద్దాం. ఆల్రెడీ యుఎస్ లో ప్రీమియర్ షోలు మొదలు కావడంతో ట్విట్టర్‌లో జనాలు తమ అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నారు. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే.. ఫస్ట్ అఫ్ బిలో యావరేజ్ గా సాగుతోందని.. కానీ అక్కడక్కడ కొన్ని వినాధాత్మక సన్నివేశాలు కనిపిస్తాయ‌ని.. ఇక మిగిలిన భాగం అసలు ఆకట్టుకోలేదని నెటిజ‌న్ కామెంట్ చేశారు. టీవీ సీరియల్ ఫీలింగ్ కలిగిందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ లో గుర్తుంచుకునేలా ఒక్క సీన్‌ కూడా లేదట. సెకండ్ హాఫ్ లో కూడా ఫన్‌తో మొదలైనా వెంటనే అదే సీరియల్ మోడ్‌కి సన్నివేశాలు వెళ్లిపోయాయి.

గీత గోవిందం కాంబో మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయిందని నెటిజ‌న్ల‌ అభిప్రాయం. విజయ్ దేవరకొండ, మృణాల్‌ ఠాగూర్ మధ్య కెమిస్ట్రీ బాగానే ఉన్నా.. దర్శకుడు పరుశురాం చెప్పాలనుకున్న పాయింట్ ఏంటో నెటిజ‌న్ల‌కు అసలు అర్థం కాలేదట‌. ఈ సినిమాను కమర్షియల్ మాస్ మూవీ అనే మైండ్ సెట్ లో కాకుండా ఫ్యామిలీతో వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు. విజయ్ దేవరకొండ, మృణాల్‌ జోడి ఆకట్టుకుంటుంది. బొమ్మ పక్కగా బ్రేక్ ఈవెన్ అవుతుంది అంటూ ఓ నేటిజన్ తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నాడు. విజయ్ దేవరకొండ తన కంఫర్ట్ జోన్ నుంచి ఇకనైనా బయటికి వస్తే బాగుంటుంది.. అన్ని సినిమాల్లో ఒకటే మ్యానరిజం చూపిస్తున్నాడు.. ఇకనైనా సరైన స్క్రిప్ట్ ఎంచుకొని సినిమా చేస్తే వర్క్ అవుట్ అవుతుంది.. లేదంటే కష్టమే అంటూ కామెంట్ చేశారు.

మూవీ ఫస్ట్ అఫ్ యావరేజ్ గా ఉంది. సెకండ్ హాఫ్ బిలో యావరేజ్. అమెరికాలో వచ్చే కొన్ని సీన్లు సిల్లీగా అనిపించాయి. రెండు సాంగ్స్ మాత్రం పర్లేదు. చిన్న చిన్న ముక్కలుగా కామెడీ కనిపించింది. మొత్తంగా సినిమా యావరేజ్ అంటూ ఓ నెటిజ‌న్‌ పోస్ట్ చేశాడు. మరో నెటిజన్ మాట్లాడుతూ ఫస్ట్ హాఫ్ లో లీడ్ పెయిర్ కాస్త ఎంటర్టైన్ చేయగలిగారు. ఫస్ట్ ఆఫ్ యావరేజ్ కానీ.. సెకండ్ హాఫ్ పూర్తిగా పడిపోయింది. పరశురాం మ్యాజిక్ అసలు వర్కౌట్ కాలేదు అంటూ కామెంట్ చేశారు. ఇక‌ ఓవరాల్ గా ఫామిలీ స్టార్ యావరేజ్ టాక్ తెచ్చుకుందని క్లియర్ గా అర్థమవుతుంది. గీత గోవిందం మ్యాజిక్ ను పరుశురాం రిపీట్ చేయలేకపోయాడు.