మీ పిల్లలు ఫోన్ ఎక్కువుగా చూస్తున్నారా..? ఈ ఒక్క పని చేయండి చాలు.. ఇక జన్మలో మొబైల్ పట్టుకోరు..!

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో మనం ఫేస్ చేసే ప్రాబ్లం మొబైల్ ఫోన్ . చిన్న కాదు పెద్ద కాదు ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ కి అడిక్ట్ అయిపోతున్నారు . కరెంటు పోయిందా చేతిలో మొబైల్ ఫోన్ ..టైం స్పెండ్ చేయాలా చేతిలో మొబైల్ ఫోన్ ..నిద్ర పట్టడం లేదా అది రాత్రి రెండు కాదు మూడు కాదు వెంటనే మొబైల్ ఆన్ చేసి యూట్యూబ్లో షాట్లు వీడియోలు చూస్తూ ఉంటాము. ఇక మరి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే కనీసం రెండు మూడు ఫోన్లు ఎక్స్ట్రా ఉండనే ఉంటాయి .

పిల్లాడు ఏడ్చాడా మొబైల్ ఫోన్.. పిల్లాడు నిద్రపోలేదా చేతిలో మొబైల్ ఫోన్.. రైమ్స్.. పాటలు.. గేమ్స్.. అబ్బో ఒకటా ..? రెండా..? ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ ప్రతి ఇంట్లో పేస్ చేస్తున్నారు . అయితే పిల్లలకు మొబైల్ ఫోన్స్ ఇవ్వడం చాలా చాలా డేంజర్ అంటూ చెప్పుకొస్తున్నారు డాక్టర్లు . చిన్నతనం నుంచే ఎక్కువగా రేడియేషన్ కి గురైయితే కళ్ళు దెబ్బ తినే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటున్నారు. అంతేకాదు ఇప్పటికే చాలామంది పిల్లలు మొబైల్ ఫోన్స్ కారణంగా కళ్ళు బాగా డామేజ్ అయిపోయాయి అని కళ్ళకు భూతద్దం లాంటి అద్దాలు పెట్టుకొని చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని పలువురు తల్లిదండ్రులు లబోదిబో అంటున్నారు ..

అయితే వీటన్నిటికీ బెస్ట్ పరిష్కారం ఒకటి ఉంది అంటూ కొందరు సోషల్ మీడియాలో వార్తలను ట్రెండ్ చేస్తున్నారు . పిల్లలు ముఖ్యంగా ఆటలకు ఎక్కువగా కనెక్ట్ అవుతారు . మనం వాళ్ళతో ఎక్కువ టైమ్స్ స్పెండ్ చేస్తూ ఉంటే మొబైల్ ఫోన్స్ పట్టుకోమన్నా పట్టుకోరు . మరీ ముఖ్యంగా ఈ జనరేషన్ లో తల్లిదండ్రులు ఇద్దరు కూడా జాబ్ హోల్డర్స్ కావడంతో పిల్లలను చూసుకునే వాళ్ళు లేక మొబైల్ ఫోన్స్ ఎక్కువగా వాడుతున్నారు .

అదే తల్లిదండ్రులు కొంచెం సమయం పిల్లలతో గడిపితే వాళ్ల బాడీ అలసిపోయే విధంగా ఆటలు ఆడిస్తే ..ఖచ్చితంగా రాత్రికి ప్రశాంతంగా నిద్రపోతారు అని.. శని ఆదివారాలలో కూడా పిల్లలకు మంచి మంచి గేమ్స్ ఇంట్లోనే చిన్న చిన్న ఆటలు ఆడిస్తూ ఉంటే పిల్లలు ఫోన్ ఎక్కువ పట్టుకోరు అని.. తల్లి కానీ తండ్రి కానీ ఖాళీ సమయం దొరికినప్పుడల్లా పిల్లలతో టైం స్పెండ్ చేస్తే మొబైల్ ఫోన్స్ దూరంగా పెట్టేస్తారు పిల్లలు అని డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తున్నారు..!!