పిల్లల్ని కనడం కన్నా కుక్క పిల్లల్ని పెంచుకోవడం బెటర్.. స్టార్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్..!!

సాధారణంగా అప్పుడప్పుడు సినీ ఇండస్ట్రీలో కొందరు స్టార్ సెలబ్రిటీలు మాట్లాడే మాటలు తెలియకుండానే అందరిలో వివాదాలను కురిపిస్తూ ఉంటాయి. అలా కొన్నిసార్లు వాళ్ళు విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో తారల తీరిపోయి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వ్యక్తిగత జీవితం గురించి.. తమ తీసుకునే నిర్ణయాలను వ్యక్తపరచడంలో కూడా వీరు ట్రోల్స్ ను ఎదుర్కొంటున్నారు. మరికొన్ని సందర్భాల్లో వీరు చేసే కామెంట్స్ ప్రజలకు ఆగ్రహాన్ని కూడా తెప్పిస్తాయి. తాజాగా కన్నడ నటి హితా చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నటింట తీవ్ర దుమారంగా మారాయి.

The greatest gift we give each other is quality time: Hitha Chandrashekar K  | Bengaluru - Hindustan Times

ఆమె తన పర్సనల్ విషయాల గురించి.. కుటుంబం, భర్త గురించి మాట్లాడుతూ తనకు పిల్లలు వద్దని.. అసలు కనాలనుకోవడం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. పిల్లల్ని కనడం కంటే.. కుక్క పిల్లలను పెంచుకోవడం మేలు అంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారడంతో.. జ‌నం ఆమెపై మండిపడుతున్నారు. కన్నడ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో సహి కహి చందర్ కు ప్రత్యేక పరిచయం అవ‌స‌రంలేదు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు.. మొదటి కుమార్తె హితా చంద్రశేఖర్ ఇండస్ట్రీ కి చెందిన నటుడు కిరణ్ శ్రీనివాస్‌ను 2019లో వివాహం చేసుకుంది. ఇక‌ ఈ ముద్దుగుమ్మ వీరికి వివాహమై నాలుగేళ్లు అయిన ఇంకా పిల్లలను కనలేదు.

ఇప్పటికీ తనకు పిల్లలు వద్దనే చెబుతున్న ఈ బ్యూటీ.. ఇటీవల ఓ షోలో పాల్గొని షాకింగ్ విషయాలను రివిల్ చేసింది. మాకు పిల్లలు కావాలని లేదు. నేను, కిరణ్ స్నేహితులుగా ఉన్నప్పుడే ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం. కిరణ్ కు కూడా ఈ నిర్ణయం నచ్చింది. నాకు నా సొంత బిడ్డ అసలు ఎందుకు కావాలి.. నాకేం అనిపించడం లేదు. నాకు ఈ ప్రపంచమే నచ్చట్లేదు. అలాంటప్పుడు మరో బిడ్డను ఈ లోకంలోనికి ఎందుకు తీసుకురావాలా.. అనే ప్రశ్న నాలో మొదలైంది. నా భర్త కిరణ్ కూడా నాలాగే ఆలోచిస్తాడు.. అందుకే అతను కూడా నా నిర్ణయాని అంగీకరించాడు.

Sihi Kahi Chandru's daughter Hitha Chandrashekar gets engaged to actor  Kiran Srinivas - IBTimes India

మాతృత్వాన్ని ఆస్వాదించడానికి సొంత బిడ్డే ఉండాల్సిన అవసరం లేదు.. కుక్కపిల్లలు కూడా సొంత బిడ్డలా పెంచుకోవచ్చు. చాలామంది నన్ను అడిగారు.. ముసలి వాళ్ళ అయ్యాక మిమ్మల్ని చూసుకోవడానికి మీకంటూ పిల్లలు ఉండాలి కదా అని.. దాని గురించి మాకు అంత బాధ లేదు. ఇక్కడ ఎవరికీ పిల్లలు పుట్టకూడదని నేను చెప్పలేదు. కేవలం ఇది నా నిర్ణయం అంటూ ఆమె వివరించింది. ఈ విషయం మా తల్లిదండ్రులకు కూడా చెప్పా. వాళ్లు కూడా నాకు సపోర్ట్ అందిస్తున్నారు అంటూ వివరించింది. ప్రస్తుతం హితా చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారడంతో ఆమెపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.