పుష్ప2 టీజర్ వచ్చేసిందోచ్.. చీర కట్టులో చించిపడేసిన పుష్ప రాజ్.. నీ యవ్వ ఇక తగ్గేదేలే (వీడియో)..!

వచ్చేసింది.. కోట్లాదిమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన ఆ క్రేజీ డే రానే వచ్చేసింది. నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు.. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పలువురు ఫ్యాన్స్ ఆయనకు సంబంధించిన సరికొత్త హాష్ ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు . ఇదే క్రమంలో అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న పుష్ప2 సినిమాకి సంబంధించిన టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్ . సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న భారీ చిత్రం పుష్ప2.

గతంలో తెరకెక్కిన పుష్పవన్ కి ఈ సినిమా సీక్వెల్ గా వస్తుంది. ఆగస్టు 15వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది ఈ మూవీ . నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఎక్స్క్లూజివ్ టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ . కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన ఈ టీజర్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది . మరీ ముఖ్యంగా పుష్ప2 అనగానే అల్లు అర్జున్ మాస్ లుక్ లో ఉండే విధంగా వీడియోని ఎడిట్ చేస్తారు అని అంతా అనుకున్నారు . కానీ టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ టు ఫుల్ చాలా వైలెంట్ గా గంభీరమైన అమ్మ వారి గెటప్ లో ఉన్న అల్లు అర్జున్ లుక్స్ ని హైలెట్ చేశాడు సుకుమార్ .

బ్లూ పట్టుచీరలో అల్లు అర్జున్ ఫైట్ కి సంబంధించిన సీన్స్ ను టీజర్ రూపంలో రిలీజ్ చేశారు పుష్ప2 మేకర్స్. ఈ లుక్ లో అల్లు అర్జున్ అదరగొట్టేసాడు అనే చెప్పాలి. జనరల్గా చీర కట్టుకొని కొంత సేపు కనిపించమంటే కనిపిస్తారు కానీ పట్టుచీరలో వైలెంట్ యాంగిల్ లో ఫైట్ సీన్స్ అంటే మాత్రం అది పుష్ప2 సినిమాకే సాధ్యమైందని చెప్పాలి . రిలీజ్ అయిన పుష్ప2 టీజర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది .

ఈ ఫైట్ సినిమాకి హైలైట్ గా మారబోతుంది అంటూ తెలుస్తుంది. పుష్ప2 సినిమా మొత్తానికి హైలైట్ గా మారబోయేది ఈ గంగమ్మ జాతర ఫైట్ సీన్ అంటూ కూడా తెలుస్తుంది. ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో యూట్యూబ్లో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. చూస్తూ ఉంటే పుష్ప రాజ్ గాడు తన రూలింగ్ స్టార్ట్ చేసేసాడు అనే చెప్పాలి . చూద్దాం మరి ఆగస్టు 15వ తేదీ రిలీజ్ అయ్యే ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో..???