“ఆ కోరికలు ఎక్కువైతే అలానే జరుగుతుంది”..రష్మిక మందన్నా సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!

రష్మిక మందన్నా.. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే స్టార్ హీరోయిన్ . త్వరలోనే రిలీజ్ కాబోతున్న పుష్ప2 సినిమాతో చరిత్ర సృష్టించడానికి రెడీగా మారిన హీరోయిన్ . రీసెంట్గా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గంభీరమైన లుక్ ఆమె ఫాన్స్ ను ఎంతగా ఆకట్టుకునిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . రీసెంట్గా రష్మిక మందన్నా.. తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది .

ఇది అందరి మనసులకు బాగా హత్తుకునింది . అంతేకాదు ఆమె మాట్లాడింది నిజమే అంటున్నారు జనాలు . తన పోస్టులో రష్మిక రాసుకోస్తూ ..” ప్రతి ఒక్కరికి లైఫ్లో కొన్ని గోల్స్ ఉంటాయి ..ప్రతిరోజు కూడా అందరూ అదే మీ చివరి రోజు అని జీవించండి .. అప్పుడే మీకు నేను చెప్పింది అర్థమవుతుంది .. నాకు తెలుసు నేను చెప్పేది మీకు బోరింగ్ గా ఉండొచ్చు.. కానీ ప్రతిరోజు మన ఖర్చులు.. బిల్లులు పెరిగిపోతున్న ఖర్చులకి తగ్గిపోతున్న సంపాదనకి మనం లైఫ్ లో ఏది ముఖ్యమో అదే కోల్పోతున్నాము.. క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ సంపాదించాలనే తాపత్రయం..”

“డబ్బు ఎక్కువగా సంపాదించాలి అనే మనస్తత్వం సంపదతో ఉంటే ఎలాంటి కోరికలు నెరవేర్చుకోవచ్చు అని ఆలోచన ఇలాంటి విషయాలలో మనం జీవితంలో మనకు ఏది ముఖ్యం అనే విషయం మర్చిపోతూ ఉంటాం. మేము ప్రస్తుతం చాలా కష్టపడి పని చేస్తున్నాము అని.. అంతా అనుకుంటూ ఉంటారు .. అయితే వాళ్ళకి లైఫ్ లో కావాల్సింది ఏంటి అనే విషయం మర్చిపోతూ ఉంటారు .. మనం ఎల్లప్పుడూ మరింత కోరుతూనే ఉంటాం.. అది ఏ విషయంలోనైనా సరే మనం మనుషులం అయితే మన వర్తమానంలో జీవించడం కూడా సమానంగా ఉంటే.. అప్పుడు ఏం జరుగుతుంది ..? అంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది . ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!