జనసేన పార్టీకి ఉపాసన రూ. 5 కోట్ల విరాళం.. అసలు నిజం ఏంటంటే..?!

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు మొద‌లు కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో జనసేన పార్టీకి ఉపాసన రూ. 5 కోట్ల విరాళం ఇచ్చిందంటూ వార్తలు వైర‌ల్‌ అవుతున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందా.. అనే విచారణ జరగగా.. ఉపాసన, జనసేననికి విరాళం ఇచ్చిందన్నమాట అవాస్తవం అంటూ తెలుస్తుంది. ఉపాసన మెగా కోడలు కావడంతో ఈ వార్త వైరల్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఈ క్రమంలో రాయలసీమలో కేవలం రెండు నియోజకవర్గాల్లో మాత్రమే జనసేన పోటీ పడనుంది.

Upasana took Pawan Kalyan's job! - TeluguBulletin.com

ఈ నియోజకవర్గాల్లో ఒకటి రైల్వే కోడూరు, మరొకటి తిరుపతి కావడం విశేషం. ఈ క్రమంలో జనసేన పార్టీ తక్కువ స్థానాల్లోనే పోటీ చేసిన ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం పవన్ నటిస్తున్న ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు కొన్ని నెలల గ్యాప్తో థియేటర్లలో వరుసగా రిలీజ్ కానున్నాయని టాక్. పవన్ సినిమాలన్నీ రూ.100 కోట్లు కంటే ఎక్కువ బడ్జెట్ తో రూపొందుతున్నాయి. జనసేన పోటీ చేస్తున్న ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థులు గెలిచేలా పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలుస్తోంది.

Pawan Kalyan Should Capture 'Media Time'

పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ పరంగాను, ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగాను ఇతర టాలీవుడ్ హీరోలతో పోలిస్తే అందని రేంజ్ లో ఉన్నారు. జనసేన మరిన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని జనసేన అభిమానులు తమ అభిప్రాయాలను నెట్టింట కామెంట్ చేస్తున్నారు. ఉపాస‌న విరాళం ఇచ్చిందంటూ వచ్చిన వార్తలు ఫేక్‌ అయినప్పటికీ ఫ్యూచర్లో ఉపాసన జనసేన పార్టీకి నిజంగా ఫండ్స్ ఇస్తే బాగుంటుందని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.