ఓకే స్టేజ్పై తారక్, త్రివిక్రమ్.. త్వరలో కొత్త సినిమా అప్డేట్ ఇవ్వనున్నారా..?!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో అరవింద సమేత వీర రాఘవరెడ్డి సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ ను బ్లాస్ట్ చేసింది. తారక్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక వీరిద్దరి కాంబోలో మరిన్ని సినిమాలు వస్తాయని ఫ్యాన్స్ అంతా భావించినప్పటికీ.. ఆర్ఆర్‌ఆర్ సినిమా రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన తర్వాత వీరి కాంబోలో రావాల్సిన సినిమా ఆగిపోయింది. తర్వాత వీరిద్దరూ కలిసి మరే స్టేజ్ పైన కూడా కనిపించలేదు. నిర్మాత నాగ వంశీ పలు సందర్భాల్లో తారక్, త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఉంటుందని భారీ సినిమా కావడంతో సెట్స్‌ పైకి వెళ్లడానికి ఆలస్యం అవుతుందని వివరించారు.

A little of “Aravinda Sametha Veera Raghava” and a lot of Trivikram  Srinivas – Achu-Murukku

ఇక ఇటీవల టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కు తారక్ హాజరవుతున్నాడు అంటూ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో త్రివిక్రమ్ సందడి చేయనున్నారట. టిల్లు స్క్వేర్ మూవీకి త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య సహనిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అందువల్ల త్రివిక్రమ్ కూడా ఈ వేడుకలు హాజరవుతారని అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబో ప్రాజెక్ట్ కు సంబంధించిన ఏదైనా ప్రకటన ఈ వేడుకలు జరుగుతుందేమోనని అభిమానులంతా ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే బాగుండని వారు ఆశపడుతున్నారు.

ntr guest for tillu square success meet movie run with shocking collections  arj

ఇక ఒకవేళ త్రివిక్రమ్ స్టోరీ కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన.. ఈ సినిమా సెట్స్‌ పైకి రావాలంటే మరో మూడేళ్లు వేచి చూడాల్సిందే. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. త్రివిక్రమ్ సినిమాలో నటిస్తే మాత్రం వీరిద్దరి క్రేజ్ మారో లెవెల్ కు వెళ్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అంటూ అభిమానులు నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ రెమ్యూనరేషన్‌కు బదులుగా సినిమాలో లాభాల వాటా తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారని టాక్‌ నడుస్తుంది. ఎన్టీఆర్ నెక్స్‌ట్ లెవెల్ ప్రాజెక్టులను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెస్సించేందేకు సిద్ద‌మౌతున్నాడు.