విశ్వక్ టు విజయ్ అందరి చూపు ఆమెవైపే.. ఇదెక్కడి క్రేజ్ రా సామీ..?!

టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన మొదటిలో ఎవరు ఆమెను పట్టించుకోలేదు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించిన ఆమెకు హీరోయిన్‌గా గుర్తింపు రాలేదు. అయితే ఇప్పుడు మాత్రం మీనాక్షి చౌదరికి భారీ లెవెల్‌లో క్రేజ్ ఏర్స‌డింది. చివరిగా మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో మహేష్ మరదలుగా నటించి ప్రేక్షకులను మెప్పించిన మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం వరుస ఆఫర్లను అందుకుంటూ పాపులర్ స్టార్ బ్యూటీగా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె విశ్వక్‌ నుంచి విజయ్ వరకు అందరితోనూ సినిమాల్లో నటిస్తూ సౌత్ ఇండస్ట్రీలోనే తన లాంటి క్రేజీ బ్యూటీ మరొకరు లేరని నిరూపించుకుంటోంది.

పైగా టాలీవుడ్ నెంబర్‌వ‌న్ హీరోయిన్ స్థాయికి దూసుకెళ్లే దిశగా శ్ర‌మిస్తుంది. మొదట సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఇచ్చ‌ట‌ వాహనాలు నిలపరాదు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మీనాక్షి.. ఈ సినిమా పరాజయం పాలవడంతో పెద్దగా అవకాశాలను అందుకోలేకపోయింది. తర్వాత రవితేజ సరసన కిలాడి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఇది కూడా డిజాస్టర్ అవడంతో ఈ అమ్మడికి హీరోయిన్గా అవకాశాలు రావ‌డం క‌ష్ట‌మైంది. ఇక ఎట్ట‌కేల‌కు మూడోసారి అడవి శేషు స‌రసన హిట్ 2 సినిమా అవకాశాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా సక్సెస్ సాధించినా దీనికి క్రెడిట్ మొత్తం పూర్తిగా అడవి శేష్‌ ఖాతాలోకి వెళ్లిపోయింది.

మీనాక్షి చౌదరి గ్లామర్ షోలో లిమిట్ లేకుండా నటించినప్పటికీ జనాల్లో అంతగా క్రేజ్ రాలేదు. ఇక మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో సెకండ్ లీడ్ గా నటించడం.. అది కూడా పూజ హెగ్డే తప్పుకోవడంతో ఆ ప్లేస్ ను ఏమి సొంతం చేసుకోవడంతో ఈమెకు మెల్లిమెల్లిగా క్రేజ్‌ వచ్చింది. ఈ సినిమా ప్లాప్ అయినా మీనాక్షి చౌదరి దిశ తిరిగింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఆమె చేతులో వరుస సినిమాలో ఉన్నాయి, దుల్కర్ సల్మాన్చ‌ విజయ్ దళపతి తో సహా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే వరుణ్ తేజ్ హీరోగా పాన్ ఇండియా సినిమా మట్కా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలోను ఆమె హీరోయిన్గా నటిస్తోంది. వీటిని బట్టి సౌత్‌లో మీనాక్షి చౌదరి ఏ రేంజ్ లో అవకాశాలను అందుకుంటుందో అర్థం చేసుకోవచ్చు.