సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్ళు అయినా..ఇప్పటికి ఆ కోరిక తీర్చుకోలేకపోయిన నాగార్జున.. దరిద్రం అంటే ఇదే..!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది . అది ఎవరికైనా సరే స్టార్ హీరో కాదు హీరోయిన్ కాదు .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు ఎవ్వరికైనా తమకంటూ ఒక ప్రత్యేకంగా డ్రీమ్ రోల్ అంటూ ఉంటుంది . అయితే సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చిన యంగ్ హీరోస్ అలాంటి కోరికలు తీర్చుకోలేకపోవచ్చు ..ఎందుకంటే వాళ్ళకి చాలా టైం ఉంటుంది . కానీ ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా కాలం అయినా.. మరికొన్ని రోజుల్లో రిటైర్ కాబోతున్న హీరో కూడా తన కోరికను తీర్చుకోలేకపోయాడు అంటే మాత్రం అది కచ్చితంగా ఆ హీరో తప్పని అంటారు జనాలు .

ప్రజెంట్ అలాంటి ట్రోలింగ్కి గురవుతున్నాడు నాగార్జున . టాలీవుడ్ ఇండస్ట్రీలో కింగ్ గా పాపులారిటీ సంపాదించుకున్న నాగార్జున రీసెంట్గా తన డ్రీమ్ రోల్ కి సంబంధించిన విషయాన్ని బయట పెట్టాడు. డైరెక్టర్స్ అలాంటి రోల్స్ తీసుకురాలేదో.. లేకపోతే అలాంటి రోల్స్ మనకు సెట్ అవ్వవు అని కామ్ గా అయిపోయాడో తెలియదు కానీ.. ఆయన యాక్షన్ జోనర్ లో ఓ సినిమాలో నటించాలి అని ఎప్పటినుంచో ఆశపడ్డారట .

అయితే ఇప్పటివరకు ఆయనకి ఆ కోరిక తీరనే తీరలేదట.. కెరియర్ రిటైర్మెంట్ అయ్యే లోపు అలాంటి ఫుల్ అడ్వెంచర్స్ యాక్షన్ సినిమాలో నటించాలనుకుంటున్నారట . ప్రజెంట్ ఇవే కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. రీసెంట్ గా నా సామీ రంగా సినిమాతో హిట్ అందుకున్న ఈ అక్కినేని నాగార్జున ..చిరకాల కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూద్దాం..!