విశ్వక్ సేన్ ‘ గామి ‘ మూవీపై రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ఏమన్నాడంటే.. ?!

టాలీవుడ్ యంగ్‌ హీరో విశ్వక్‌సేన్ నటిస్తున్న తాజా చిత్రం గామి. చాందిని చౌదరి హీరోయిన్గా విద్యాధర్‌ కాగితపు డైరెక్షన్లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఇప్పటివరకు నటించిన మాస్‌ సినిమాలకు భిన్నంగా ఈ కథ ఉండబోతుంది. తన కెరీర్‌లోనే మొట్టమొదటిసారి విశ్వక్ ఈ సినిమాలో ఓ అఘోర పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో ఆయన ఓ కొత్త ప్రయోగం చేయ‌న్నునాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన గామి ట్రైలర్ పై చాలామంది సెలబ్రిటీస్ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి.. గామి సినిమా గురించి తన ఇన్స్టా వేదికగా ఆసక్తికర పోస్ట్‌ను షేర్ చేశాడు.

అందులో రాజమౌళి వివరిస్తూ.. కఠోరమైన కృషి ఉంటే ఎంతో కష్టమైన, అసాధ్యమైన కలలు కూడా సాకారం అవుతాయి అనడానికి గామి సినిమా నిదర్శనం. గామి గురించి నిర్మాత కార్తీక్, దర్శకుడు విద్యాధర్ ఎంత కష్టపడ్డారో నన్ను కలిసి నాతో చెప్పినప్పుడు ఈ మాటే గుర్తొచ్చింది. సినిమాలోని విజువల్స్ చూశాక నాలుగేళ్ల నుంచి వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు అర్థమైంది.. అంటూ జక్కన్న వివరించాడు. మార్చి 8న గామి రిలీజ్ సందర్భంగా టీం మొత్తానికి నా స్పెషల్ విషెస్ తెలియజేస్తున్నాను అంటూ రాజమౌళి రాసుకొచ్చాడు. ప్రస్తుతం రాజమౌళి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవ్వడంతో సినిమాలో విజువల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక గామి సినిమా మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న రిలీజ్ కానుండగా.. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది.

సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో.. దీనిపై ఆనందం వ్యక్తం చేస్తూ మూవీ టీం స్పెషల్ పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ చేయకపోవడం పై హీరో విశ్వక్ మాట్లాడుతూ.. రీషబ్ శెట్టి కాంతారాను కూడా మొదట ఒక్క భాషలోనే రిలీజ్ చేశారు. అక్కడ వచ్చిన భారీ సక్సెస్ మంచి రెస్పాన్స్ పరంగా దేశవ్యాప్తంగా సినిమాలు విస్తరించారు. సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు గామి విషయంలో కూడా మేము ఇదే ఫాలో అవ్వనున్నాం. ఈ సినిమా ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్‌ను బ‌ట్టి ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేస్తాం. కచ్చితంగా ఈ సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంటుందని నమ్మకం మా అందరిలోనూ ఉంది అంటూ విశ్వక్ వివరించాడు. ఇక ఈ మూవీ హీరోయిన్ చాందిని చౌదరి మాట్లాడుతూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డామని.. రియల్ స్టంట్స్‌ కూడా చేశామంటూ వివరించింది.