అదే జరిగితే ‘పుష్ప2’ కి భారీ దెబ్బ తప్పదా..? బన్నీని తొక్కేయడానికి ఇంత కుట్ర జరుగుతుందా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పబ్లిసిటీ పాపులారిటీ దక్కించుకున్న హీరో అల్లు అర్జున్ ని తొక్కేయడానికి తెరవనక భారీ కుట్ర జరుగుతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది. మనకు తెలిసిందే అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప టు సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు.. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ చాలా చాలా కష్టపడ్డాడు. పుష్ప వన్ సినిమాకి గాను ఏకంగా ఉత్తమ జాతియ నటుడి అవార్డు కూడా అందుకున్నాడు .

ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు . దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా ఎప్పుడో చేసేసారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి పోటీగా మరికొన్ని సినిమాలు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం రోహిత్ శెట్టి సింగం అగైన్ సినిమా రిలీజ్ కూడా ఆగస్టులోనే ముహూర్తం పెట్టారట . ఇది ఓ భారీ మల్టీస్టారర్ అన్న విషయం తెలిసిందే .

సింగం సిరీస్ కు ఎంత క్రేజ్ ఉందో కూడా చెప్పనవసరం లేదు. కాగా పుష్ప2కు మరో సినిమా కూడా కాంపిటీషన్ గా రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న గోట్ సినిమా కూడా ఆగస్టులోనే రిలీజ్ చేయాలి అంటూ మేకర్స్ డిసైడ్ అయ్యారట . ఈ సినిమా హిట్ అయింది అంటే కచ్చితంగా తమిళ్ ఇండస్ట్రీలో బన్నీ కి భారీ బొక్క తప్పదు అంటున్నారు సినీ విశ్లేషకులు .

టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో పిరియాడిక్ బ్యాగ్రౌండ్ లో వెంకట్ ప్రభు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు . దీంతో పుష్ప2 పై అందరికీ కొత్త డౌట్లు మొదలయ్యాయి. ఎందుకు బన్నీను టార్గెట్ చేసి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. చూద్దాం మరి బన్నీ ఈ కాంపిటీషన్ నుంచి ఎలా బయటపడతాడో..? ఎలా తన సినిమాని ప్రమోట్ చేసుకొని సక్సెస్ సాధిస్తాడో..?