ఆ ఒక్క పనే రష్మిక ని నడిరోడ్డుపై పడకుండా చేసిందా..? వెరీ లక్కీ ఫెలో..!

రష్మిక మందన్నా.. ఈ పేరు చెప్తే వచ్చే అరుపులు .. ఏ రేంజ్ లో ఉంటాయో మనకు తెలుసు. ఒక స్టార్ హీరో ఒక పాన్ ఇండియా హీరోని మిక్సీలో వేసి మిక్స్ చేస్తే వచ్చే ఫ్యాన్ ఫాలోయింగ్ రష్మిక మందన్నా దక్కించుకుంది . ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే నేషనల్ క్రష్ గా ట్యాగ్ చేయించుకున్న ఈ బ్యూటీ ఇండస్ట్రీని ఓ రేంజ్ లో ఉపేసింది. ఈ అమ్మడు ప్రజెంట్ తన ఖాతాలో ఆరు సినిమాలను పెట్టుకుని ఉంది. ఆరు కూడా బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాలే కావడం గమనార్హం.

మరీ ముఖ్యంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న పుష్ప2 సినిమా రిలీజ్ అయితే మాత్రం రష్మిక కెరియర్ ఎక్కడికి వెళ్ళిపోతుందో అసలు ఊహ కూడా మనకు రాదు . అలాంటి స్థానాన్ని దక్కించుకోబోతుంది . రీసెంట్గా రష్మిక కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది. రష్మిక తన కెరియర్ లో చాలా మంచి డెసిషన్స్ తీసుకుంది అని .. ఒకవేళ ఆమె తప్పుడు నిర్ణయం తీసుకొని ఉంటే ఆమె బ్రతుకు బస్టాండ్ అయ్యుండేది అని ..ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది.

మనకు తెలిసిందే రష్మిక – రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకుని బ్రేకప్ చెప్పుకుంది . దానికి కారణం వేణూ స్వామి అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆమెకు స్టార్ అయ్యే భవిష్యత్తు ఉంది అని .. రక్షిత్ శెట్టిని పెళ్లి చేసుకుంటే కెరీర్ ఢమాల్ అని పడిపోతుంది అని చెప్పి వాళ్ళ నిశ్చితార్ధాన్ని బ్రేకప్ చేయించేసి ..ఆమె చేత ప్రత్యేక పూజలు చేయించారట . రష్మిక కూడా వేణు స్వామి మాటలను నమ్మింది . అందుకే ఇప్పుడు స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది . ఒకవేళ రష్మిక ఆ నాడు వేణు స్వామి చెప్పిన మాటను వినకుండా పెళ్లి చేసుకుని ఉంటే ఇప్పటికీ ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యి డ్రమ్ములా ఉండేది అంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు . ఆ విషయంలో రష్మిక వెరీ వెరీ లక్కీ ఫెలో అంటూ పొగిడేస్తున్నారు..!!