” కంగువ ” మూవీ టీజర్ లోడింగ్ అంటున్న మేకర్స్.. పోస్ట్ వైరల్..!

బాలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.ఈయన కోలీవుడ్ లోనే మంచి పేరు సంపాదించుకున్నారు.సూర్య నటిస్తున్న తాజా చిత్రం ‘ కంగువ ‘. పిరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి..శివ దర్శకత్వం వహిస్తున్నాడు.

దిశా పటాని ఫి మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ ఈ మూవీలో కీ రోల్ చేస్తున్నాడు. ఇక స్టూడియో గ్రిన్- మూవీ క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం త్రిడి ఫార్మాట్ లో కూడా సందడి చెయ్యనుంది. అయితే కొత్త అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు తాజాగా అదిరిపోయే వార్తను షేర్ చేశారు మేకర్స్.

‘ అద్భుతాన్ని చూసేందుకు రెడీగా ఉండండి..మీ వ్యక్తిగత స్ర్కీన్లను మంట పెట్టేంచేందుకు రేపు సాయంత్రంరేపు సాయంత్రం 5:30 గంటలకు టీజర్ రాబోతుంది ‘ …అంటూ ట్రీట్ చేశారు.ఇప్పటికే మేకర్స్’ కంగువ’నుండి విడుదల చేసిన సెకండ్ లుక్ లో సూర్య వారియర్ గా కత్తి పట్టి కనిపిస్తూ..మరోవైపు స్టైలిష్ లుక్ లో మ్యాజిక్ చేస్తున్నాడు. మరి టీజర్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.