నా హృదయం ముక్కలైపోయింది.. బోరుమని ఏడుస్తూ ఎమోషనల్ ట్వీట్ని షేర్ చేసిన సుమ..!

యాంకర్ సుమ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె యాంకర్ గా ఎంతో కాలం ఇండస్ట్రీలో రాణిస్తూ వచ్చింది. యాటా సత్యనారాయణ డైరెక్షన్ లో బాబీ సింహా,అనసూయ కీలక పాత్రలో నటించిన సినిమా’ రజాకర్’ ఇందులో రాజ్ అర్జున్,మార్కాండ దేశ్ పాండే , ఇంద్రజ,తేజ్ సప్రు, తలైవాస్ విజయ్ ప్రధాన పాత్రలో నటించాడు.

దీనిని గూడూరు నారాయణ నిర్వహించారు.ఈ మూవీని యథార్ష ఘటనల ఆధారంగా తెరకెక్కించారు. అయితే రజాకర్ మార్చ్ 15వ తేదీన ప్రేక్షకులు ముందుకు వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఇంతటి దారుణాలు జరిగాయా? అని తమ చరిత్రను తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. అప్పట్లో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసుకుని చలించిపోతున్నారు. ఇక తాజాగా రజాకర్ సినిమా చూసిన యాంకర్ సుమ ఎమోషనల్ ట్విట్ చేసింది. జస్ట్ ఇప్పుడే రజాకర్ సినిమా చూశాను.

సంఘటనలు, హైదరాబాద్ సంస్థానం స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటాన్ని చూసి గుండె పగిలిపోయేలా ఉంది. ఇందులో ఈ సంఘటనలు కళ్లకు కట్టినట్టుగా చూపించినందుకు డైరెక్టర్కు ధన్యవాదాలు చెప్పారు. అనసూయ, ప్రేమ, ఇంద్రజ నటులు సింహ అందరూ చాలా బాగా నటించారు సూపర్ ” అంటూ రాసుకోచ్చింది. ప్రస్తుతం సుమ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.