అన్ని బాగున్న మోక్షజ్ఞకు ఆ ఒక్కటే మైనస్.. అందుకే హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఆలోచిస్తున్నాడా ..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో కొడుకులు .. కూతుర్లు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది . మరీ ముఖ్యంగా బడా హీరో ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఆ విషయాని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కొందరు మాత్రం తమ కొడుకులని ఎలాగైనా సరే హీరో చేయడానికి చాలా చాలా కష్టపడుతూ ఉంటారు .దానికి తగ్గ ప్రిపరేషన్ ముందు నుంచే చేస్తూ ఉంటారు .

కానీ అదృష్టమో దురదృష్టమో కొన్నికొన్నిసార్లు ఆ విషయం లేట్ కావచ్చు. ప్రెసెంట్ అలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తున్నాడు బాలకృష్ణ . టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నరసింహం గా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య తన కొడుకు మోక్షజ్ఞను ఇండస్ట్రీ లోకి హీరోగా రప్పించడానికి చాలా చాలా ట్రై చేస్తున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల చేత అది ఆలస్యం అవుతూ వస్తుంది .

రీసెంట్గా మోక్షజ్ఞ కి సంబంధించి జనాలు విపరీతంగా చర్చించుకుంటున్నారు. నందమూరి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా మోక్షజ్ఞ కటౌట్ చూసి కొందరు డౌట్ పడుతున్నారు. అన్ని బాగున్న మోక్షజ్ఞకు హైట్ పరంగా నెగిటివ్ రిమార్కు వినిపిస్తుంది. మొదట చాలా బొద్దుగా ఉన్న మోక్షజ్ఞ ఇప్పుడు సినిమాల కోసం తగ్గాడు . కటౌట్ బానే ఉంది . కానీ హైట్ మాత్రం అంత ఆకర్షణీయంగా లేదు అంటూ జనాలు చర్చించుకుంటున్నారు . ఆ ఒక్కటే మైనస్ అంటూ వేలు ఎత్తి చూపిస్తున్నారు..!!