ప్రభాస్ కోసం అల్లు అర్జున్ అతి పెద్ద త్యాగం.. ఏ హీరో చేయకూడని పని.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..!

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో యమ వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం మరొక హీరో త్యాగం చేయడం ..చాలా చాలా రేర్ గా చూస్తుంటాం. మరీ ముఖ్యంగా ఈ పాన్ ఇండియా యుగంలో అలాంటి సీన్స్ అస్సలు కనిపించవు. నువ్వెంత అంటే నువ్వు ఎంత అని పోట్లాడుకునే హీరోలని తప్పిస్తే ఒక హీరో కోసం ఇంకొక హీరో కాంప్రమైజ్ అయ్యే సీన్స్ మనం తెరపై మాత్రమే చూడగలం.

రియాలిటీలో చూడలేము.. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అలాంటి సంచలన సీన్ రిపీట్ చేయబోతున్నాడు ప్రభాస్ – అల్లు అర్జున్. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ బెస్ట్ ఫ్రెండ్స్ గా కొనసాగుతున్న ప్రభాస్ – అల్లు అర్జున్ ఇద్దరు కూడా పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్నారు. ఇద్దరు కూడా ఒక్కొక్క సినిమాకి వంద నుంచి 150 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటూ వస్తున్నారు. ప్రభాస్ తన కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా కల్కి .

ఈ సినిమా మే 9న రిలీజ్ అవ్వబోతుంది . అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మే 13న జరగబోతూ ఉండడంతో కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమాని ఆగస్టు లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట మేకర్స్ . నిజానికి ఆగస్టు 15వ తేదీ పాన్ ఇండియా స్టార్ బన్నీ పుష్ప సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు . అయితే ఇప్పుడు ప్రభాస్ స్వయంగా కాల్ చేసి రిక్వెస్ట్ చేయడంతో బన్నీ ఆ డేట్ నుంచి తప్పుకుంటున్నాడట .

ఆగస్టు 15వ తేదీ కల్కి రిలీజ్ కాబోతుంది అని ..సెప్టెంబర్ లో పుష్ప సినిమా రిలీజ్ కాబోతుంది అని ప్రచారం జరుగుతుంది . ప్రభాస్ – బన్నీ ఈక్వల్ గా ఈ డెసిషన్ తీసుకున్నారట . దీంతో ప్రభాస్ కోసం బన్నీ ఇంత పెద్ద త్యాగం చేస్తున్నాడా..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు. ఇండస్ట్రీలో ఏ హీరో కూడా ఇలాంటి సిచువేషన్ ఫేస్ చేయకూడదు అని ఇలాంటి త్యాగాలు చేయకూడదు అని నీతి వ్యాఖ్యలు చేస్తున్నారు..!!