కస్టడీ ఫెయిల్ అయితే.. నా కెరీర్ ఫెయిల్ అవుతుందన్నారు.. కృతి శెట్టి షాకింగ్ కామెంట్స్..

ఉప్పెన‌ మూవీ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది స్టార్ హీరోయిన్ కృతి శెట్టి. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమా సక్సెస్ తో వరుస ఆఫర్లను అందుకుంది. ప్రారంభంలో ఛాన్సులు రావడమే గొప్ప. అలాంటిది స్టార్ హీరోలతో నటించే ఛాన్స్ లో అందుకుని వరుసగా 5,6 సినిమాల్లో నటించింది. కానీ ఊహించిన రేంజ్‌లో సక్సెస్ రాలేదు. నానితో కలిసి నటించిన శ్యామ్‌సంగరాయ్‌, నాగచైతన్యతో కలిసి చేసిన బంగారు రాజు యావరేజ్ గా ఆడాయి. ఇక రామ్‌తో దివారియర్‌, నితిన్‌.. మాచర్ల నియోజకవర్గం, సుదీర్ బాబు.. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నాగచైతన్య కస్టడి సినిమాల్లో నటించి మెప్పించినా.. ఇవి ఒకదాని తర్వాత ఒకటి వరుసగా రిలీజ్ అయి ఫ్లాప్ టాక్‌ తెచ్చుకోవడంతో ఎంత స్పీడ్‌గా సక్సెస్ సాధించిందో అదే రేంజ్ లో ఒక్కసారిగా పడిపోయినట్లు అయింది.

దీంతో తెలుగులో కృతి శెట్టి కి ఆఫర్స్ కరువయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో కృతి శెట్టి తనకు సంబంధించిన ఓ షాకింగ్ విషయాన్ని షేర్ చేసుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందడి చేసిన కృతి.. ఇంటర్వ్యూవ‌ర్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పింది. మీకు బాగా రెగ్యులర్గా అనిపించిన ప్రశ్న, బాగా హార్ట్ చేసిన ప్రశ్నలు ఏంటి అని అడగగా.. కృతి ఇలా చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరు రెగ్యులర్ గా సినిమాకు సంబంధించిన స్టార్ హీరో, డైరెక్టర్, షూటింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పమంటారు. వారితో పని చేయడం ఎలా ఉంటుందని తరచుగా ప్రశ్నిస్తూ ఉంటారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే.. ఒకవేళ షూటింగ్ ఎక్స్పీరియన్స్ బాగోకపోయినా ఆ విషయం చెప్తామా.. ఇది నాకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది అంటూ వివరించింది కృతి శెట్టి.

అలాగే బాగా హార్ట్ చేసిన ప్రశ్న ఏంటో చెబుతూ కస్టడీ సినిమా ఫెయిల్ అయితే ఇదే మీకు చివరి ఛాన్స్ అవుతుందా.. ఇక ఆఫర్లు రావా.. అని ప్రశ్నించారని.. ఆ ప్రశ్న తనని చాలా హార్ట్ చేసిందని చెప్పుకొచ్చింది. అయితే దానిలో కాస్త నిజమే ఉన్న లక్కీగా ప్రస్తుతం ఆఫర్లు వస్తున్నాయని.. సినిమాల్లో బిజీగా ఉంటున్నట్లు వివ‌రించింది. ఇప్పటికీ తనకు ఆఫర్లు వస్తున్నాయని.. ఆ విషయాన్ని నిరూపించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నానని వెల్లడించింది కృతి శెట్టి. ఇక చివరిగా కస్టడీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీలో మూడు సినిమాల్లో బిజీగా గ‌డుపుతుంది. అలాగే ఓ మలయాళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వరుస షూటింగ్‌ల‌లో బిజీగా గడుపుతుంది.